Bill Clinton : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Clinton : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని అందులో పాజిటివ్ గా తేలిందని ఆయన పేర్కొన్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయినా తాను బాగానే ఉన్నా, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నానని ప్రకటించారు. వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోసు తీసుకోవడంతో తీవ్రత తక్కువగా ఉందన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ట్విటర్ ద్వారా ప్రజలకు సూచించారు. బిల్ క్లింటన్ ఈ మధ్యే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను దక్షిణ కాలిఫోర్నియా ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్లో ఆయన రక్త సంబంధ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన కోవిడ్ బారిన పడ్డారు.
Read Also: Top Headlines- @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ వరుసగా రెండు సార్లు పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతి నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో 2005లోనూ తిరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు. తర్వాత కొన్ని రోజులకు కోలుకున్న బిల్‌క్లింటన్ పూర్తి ఆరోగ్యంగా కనిపించారు. ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు. హిల్లరీ క్లింటన్ తరపున పలుసార్లు ప్రచార బాధ్యతలను బిల్‌క్లింటన్ చేపట్టారు. క్లింటన్ ఫౌండేషన్ కు సంబంధించిన కార్యక్రమం కోసం కాలిఫోర్నియాలో ఉన్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>I’ve tested positive for Covid. I’ve had mild symptoms, but I’m doing fine overall and keeping myself busy at home.<br> <br>I’m grateful to be vaccinated and boosted, which has kept my case mild, and I urge everyone to do the same, especially as we move into the winter months.</p>— Bill Clinton (@BillClinton) <a href=”https://twitter.com/BillClinton/status/1598031920642011136?ref_src=twsrc%5Etfw”>November 30, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!