NTV Telugu Site icon

Paris Olympics: ఒలింపిక్స్ వేడుకలో పెద్ద తప్పిదం..క్షమాపణలు చెప్పిన నిర్వహణ కమిటీ

South Korean

South Korean

పారిస్‌లో ప్రారంభ వేడుకల్లో ఓ తప్పిదం జరిగింది. ఒలింపిక్ క్రీడల నిర్వాహకులు దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా వాసులుగా పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. దక్షిణ కొరియా బృందం సెయిన్ నదిలో పడవపై తమ దేశ జెండాను ఎగురవేసింది. ఈ సమయంలో వారిని ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషల్లో ‘డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా)’గా పరిచయం చేశారు. కాగా.. దక్షిణ కొరియాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ‘ఎక్స్’లో కొరియన్ భాషలో ‘ప్రారంభ వేడుకల ప్రసారంలో కొరియా జట్టును పరిచయం చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.’ అని రాసుకొచ్చారు. ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు (IOC) థామస్ బాచ్‌తో సమావేశం కావాలని కోరుతూ.. దక్షిణ కొరియా సాంస్కృతిక క్రీడలు, పర్యాటక మంత్రిత్వ శాఖ ఉప మంత్రి జాంగ్ మి రాన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

READ MORE: Niti aayog: మమత వ్యాఖ్యలను ఖండించిన నీతి ఆయోగ్ సీఈవో

ఫ్రాన్స్ ప్రభుత్వానికి ‘ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు’ దాఖలు చేయాలని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా ఆదేశ మంత్రిత్వ శాఖ కోరిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పారిస్‌ గేమ్స్‌ నిర్వాహకులను దక్షిణ కొరియా ఒలింపిక్‌ కమిటీ ప్రత్యేకంగా కోరినట్లు ఆ ప్రకటన తెలిపింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి కొరియన్ ద్వీపకల్పం దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాగా విభజించబడింది. అయితే.. దక్షిణ కొరియా అథ్లెట్లు ప్రయాణిస్తున్న పడవలో నీలిరంగు గుర్తులపై సరైన పేరు కనిపించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.