Site icon NTV Telugu

Crime News: వృద్ధుడి దారుణ హత్య.. రాళ్లు, కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు

Murder

Murder

Crime News: నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి.. ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో కొట్టడంతో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పాతకక్షలే కారణమని స్థానికులు అంటున్నారు. గ్రామంలో ఉద్రిక్తతగా ఉండటంతో పోలీస్ బలగాలు మోహరించాయి. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: Road Accident : కారు-బస్సు ఢీకొని ఆరుగురు మృతి.. 30 మందికి గాయాలు

Exit mobile version