ట్యాక్సీ రైడర్ అవతారమెత్తి ఓ దొంగ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఓలా ట్యాక్సీ రైడర్‌గా ఉంటూ.. ప్రయాణికుల వద్ద నుంచి పలు వస్తువులను కొట్టేసేవాడు. తాజాగా.. ఓ మహిళ బ్యాగ్‌తో పారిపోయి పోలీసులకు చిక్కాడు. ఆ బ్యాగ్‌లో ఐఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని సొసైటీలో నివసిస్తున్న అధీరా సక్సేనా అనే మహిళ ఓలా బైక్‌ను బుక్ చేసింది. బైక్ పై ప్రయాణం చేసి తన గమ్యస్థానం వచ్చి బైక్ నుండి దిగిపోయింది. అయితే.. ఆ సమయంలో టాక్సీ రైడర్ కు డబ్బులు ఇస్తున్న క్రమంలో తన వద్ద ఉన్న బ్యాగ్ తో అక్కడి నుంచి బైక్ రైడర్ పారిపోయాడు.
Telangana Formation Day: ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌కు ఆహ్వానం.. సీఎం రేవంత్ ప్రత్యేక లేఖ
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బ్యాగ్ లో పర్సు, కార్డులు (డెబిట్, మెట్రో కార్డ్, ATM కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్), ఒక డెల్ ల్యాప్‌టాప్ మరియు ఐఫోన్ ఇతర వస్తువులు ఉన్నాయని పోలీసులకు తెలిపింది. దీంతో.. నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. గురువారం అర్థరాత్రి స్పెక్ట్రమ్ మాల్ సమీపంలో నిందితుడు ప్రమోద్ సింగ్ ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు పోలీసులను చూడగానే పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో.. పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో నిందితుడికి గాయం కాగా.. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం నిందితుడిపై విచారణ చేపట్టగా.. అతనిపై దాదాపు అరడజను క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రాథమిక రుజువులో తేలిందని పోలీసులు తెలిపారు. అతని వద్ద ఉన్న ఓలా బైక్ కూడా దొంగిలించబడిన వాహనమేనని పేర్కొన్నారు. కాగా.. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 392 (దోపిడీ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నుంచి మహిళకు సంబంధించిన బ్యాగ్.. కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు కొన్ని మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
