NTV Telugu Site icon

Ola Scooters: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

Ola Electric Scooter

Ola Electric Scooter

Ola Scooters: ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలోనూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఘనంగా ముగించింది. డిసెంబర్ నెలలో మొత్తంగా 25 వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‍లో ఓలా 30 శాతం వాటాను దక్కించుకుంది. ఒకే నెలలో 25వేల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడవడం ఇదే తొలిసారి. తమ కంపెనీ సేల్స్ పెరగడంపై ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు.

Read Also: Rahul Gandhi: ప్రియాంకకు ముద్దు పెట్టిన రాహుల్ ఫోటో వైరల్

ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం నడుస్తోందని భవీశ్ అగర్వాల్ అన్నారు. 2023లో ఈ వాహనాల అమ్మకాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో వృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి మూడు స్కూటర్లు భారత మార్కెట్‍లో అందుబాటులో ఉన్నాయి. ఓలా ఎస్1 , ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయర్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఓలా ఎస్1 ఎయిర్ వాహనాన్ని ఆవిష్కరించారు. ఓలా ఎస్1 ధర రూ.99,999, ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,39,999గా ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ వాహనం ధర రూ.84,999 ధరగా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలియజేశాయి.