NTV Telugu Site icon

Ola Electric: కుక్కకి కొలువిచ్చిన ఓలా ఎలక్ట్రిక్.. ఐడీ కార్డు కూడా భలే ఉందిగా..

Ola Electric

Ola Electric

Ola Electric: కుక్కకి పట్టెడన్నం పెడితే చాలు ప్రాణం పోయేవరకు విశ్వాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం కారణంగానే గ్రామసింహం అనే పేరుని సంపాదించింది శునకం. ఆకలి తీర్చిన వారిపైన విశ్వాసాన్ని చూపడమే కాదు మంచిగా శిక్షణ ఇస్తే శునకం చెయ్యని పనంటూ ఉండదు. అందుకే దేశ భద్రత వ్యవస్థలలో కూడా శునకాన్ని అగ్రతాంబూలం ఇస్తారు. ఎంతోమంది నేరస్తుల్ని పట్టుకోవడంలో క్లిష్టమైన కేసులని చేధించడంలోనూ శునకాలు ఒక ప్రత్యేక పాత్రని పోషించిన సంఘటనలు కోకొల్లలు.అయితే ఇన్ని రోజులు పోలీసు శాఖలో పని చేయడం చూసాం , ఇల్లలో చిన్నచిన్న పనులు చేయడమూ చూసాం కానీ తాజాగా ఒక కుక్క ఎలక్ట్రానిక్ రంగంలోనూ ఉద్యోగాన్ని సంపాదించింది. అది కూడా చిన్న చితక కంపెనీ కాదు… భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా.

Also Read: Spandana Death: పునీత్ రాజ్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మరొకరు మృతి!

మార్కెట్‌లో ఓలా కంపెనీకి ఉన్న ప్రజాధారణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… ఎస్1 , ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ అనే మూడు అధునాత ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేసి అద్భుతమైన లాభాలను పొందింది. అయితే తాజాగా ఎస్ 1 ఉత్పత్తిని నిలిపివేసిన OlA ఎస్ 1 ఎయిర్ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. అయితే ఓలా ఎస్ 1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ పైన ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సంతకాలు చేసారు…కానీ కొత్తగా నియమింపబడిన బిజిలి అనే కుక్క మాత్రం సంతకం చేయకుండా స్కూటర్ సీటు పైన కూర్చుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోని ఆ సంస్థ సీఈవో తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Talasani Srinivas Yadav : గద్దర్ మరణం తెలంగాణ సమాజానికే తీరని లోటు

ఇప్పటికే ఓలా ఎస్ 1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ ని బుక్ చేసుకునే కస్టమర్ల సంఖ్య పెరిగింది. త్వరలోనే డెలివెరీలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్‌లో దీని ధర రూ.85099 నుంచి 1.1లక్షల మధ్య ఉండనుంది. ఇంకా ఉద్యోగి బిజిలీ విషయానికి వస్తే..గత కొన్ని రోజుల క్రితం బిజిలీ అనే కుక్కకి ఉద్యోగం కలిపిస్తూ ఐడి కార్డు ని కూడా అందించారు…అందులో 440v అనే ఎంప్లొయ్ ఐడి తో పాటుగా దాని అడ్రస్, బ్లడ్ గ్రూప్‌ని కూడా మెన్షన్ చేసారు. రూల్ ఐస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనేవిధంగా అందరి ఉద్యోగులకి ఉన్నట్లే దీనికి సకల సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Show comments