NTV Telugu Site icon

OLA – Google Maps : గూగుల్‌ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకున్న ఓలా.. ఇకపై..

Ola

Ola

OLA – Google Maps : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఒకటైన ఓలా తాజాగా గూగుల్ మ్యాప్స్ నుండి నిష్క్రమించినట్లుగా తెలిపింది. ఇకనుంచి ఓలా క్యాబ్స్ గూగుల్ మ్యాప్స్ ను వాడుకోదని కంపెనీ తెలిపింది. అయితే గూగుల్ మ్యాప్స్ బదులుగా.. ఓ ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్సీ సేవలను అందుబాటులోకి తీసుక వస్తున్నట్లు ఓలా తెలిపింది. ఇలా గూగుల్ మ్యాప్స్ తో ఓలా ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా సంస్థకు ప్రతి సంవత్సరం కంపెనీకి 100 కోట్ల ఆదాయం చేకూరుతుందని ఓలా సంస్థ సహా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుండి ఓలా క్యాబ్స్ సర్వీసులలో గూగుల్ మ్యాప్స్ ను రద్దు చేస్తున్నామని., దానికి ప్రత్యాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెంట్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు హైదరాబాదీలు మృతి..

ఇలా చేయడం ద్వారా.. ప్రతి సంవత్సరం సంస్థకు ఏకంగా 100 కోట్ల ఆదాయం చేకూరుతుందని తెలిపారు. కొత్త సర్వీసులో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ వినియోగదారులు ఓలా యాప్ ను అప్డేట్ చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓలా లోకేషన్ ఇంటెలిజెన్సీలో ఇండోర్ చిత్రాలు అలాగే స్ట్రీట్ వ్యూ, డ్రోన్ మ్యాప్స్, 3d మ్యాప్ లాంటి అనేక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇదివరకు ఓలా క్లౌడ్ సర్వీస్ లను మైక్రోసాఫ్ట్ నిర్వహించేదని.. కాకపోతే ఇటీవల ఆ సంస్థతో కూడా కార్యకర్తలు నిలిపేసామని వారు తెలిపారు. ఇందులో భాగంగా కృత్రిమ క్లౌడ్ సేవలు తాము వినియోగించుకుంటున్నామని వారు తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల ఏఐ మ్యాపింగ్ సొల్యూషన్స్ కూడా అందిస్తుందని వారు తెలిపారు. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అప్డేట్లు కూడా వస్తాయని వారు తెలిపారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు హైదరాబాదీలు మృతి..