NTV Telugu Site icon

OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు

Ola

Ola

ప్రముఖ పట్టణాల్లో ప్రయాణం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే మనతో సొంత వాహనమే ఉండాల్సిన అవసరం లేదు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వాటి సాయంతో వెళ్లాలను కున్న గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. కానీ కొంత మంది క్యాబ్ డ్రైవర్ల దురుసు ప్రవర్తనలు ప్రయాణికులకు చేదు అనుభవాల్ని మిగిలిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓలా ఆటో డ్రైవర్ తో తనకు జరిగిన వాగ్వాదం గురించి తెలిపారు. బెంగళూరుకు చెందిన తనీషా మాల్యా ఓలా ఆటో డ్రైవర్‌తో బాధకరమైన అనుభవాన్ని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఛార్జీల విషయంలో విభేదాలు రావడంతో డ్రైవర్ నుంచి వేధింపులు, దుర్భాషలాడినట్లు ఆమె పేర్కొన్నారు.

READ MORE: Urban Naxalism Bill: మహారాష్ట్ర అసెంబ్లీ ముందుకు ‘అర్బన్ నక్సలిజం’ బిల్లు..

“ఈరోజు బెంగుళూరులో ఓలా క్యాబ్ డ్రైవర్ తో నాకు చాలా బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది. నేను ఓలా ఆటోను బుక్ చేసాను. అది -25 కి.మీకి గానూ రూ. 347-356 చూపింది. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. ఆటో డ్రైవర్ తనకు కనీసం రూ. 470 చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఎందుకంటే అతను 45 కిమీ కంటే ఎక్కువ డ్రైవ్ చేశానని చెప్పాడు. ఇరువురి ఫోన్లలో రూ.356 చెల్లించాలని స్పష్టంగా చూపిస్తోంది. తాను అడిగిన మొత్తం ఇవ్వాలని అతడు నాపై అరవడం ప్రారంభించాడు. అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు నేను నిరాకరించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. డ్రైవర్ వాహనం నుంచి కిందకు దిగాడు. దూకుడుగా మాట్లాడాడు. రూ. 470 చెల్లించకపోతే ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో అక్కడే వదిలేస్తానని బెదిరించాడు. అయినా నేను పట్టించుకోకుండా రూ. 356 చెల్లించి అపార్టుమెంట్ గేట్ లోపిలికి ప్రవేశించేందుకు యత్నించాను. ఈ క్రమంలో డ్రైవర్ దుర్భాషలాడుతూ.. దురుసుగా ప్రవర్తించాడు. కన్నడలో తిట్టడం మొదలు పెట్టాడు.” తనీషా మాల్యా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

READ MORE:Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి

ఓలా నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించలేదని, కస్టమర్ కేర్‌తో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆమె తెలిపారు. మీటర్ ప్యాటర్న్‌ల ఆధారంగా ఓలా కొత్త ఛార్జీల విధానాన్ని అమలు చేయడమే ఛార్జీల వ్యత్యాసానికి కారణమని మాల్యా గుర్తించారు. ఇతర ప్రయాణీకులకు, ముఖ్యంగా కన్నడ తెలియని లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా 10 నిమిషాల వ్యవధిలో జరిగిందని.. తనకు కన్నడలో మాట్లాడటం వచ్చు కాబట్టి వాదించినట్లు ఆమె తెలిపారు. డ్రాప్ లోకేషన్ తన అపార్టు మెంట్ కాబట్టి తన తండ్రి సహాయం చేసేందుకు వస్తారని.. తెలియని ప్రాంతంలో డ్రాప్ ఉన్న మహిళల రక్షణకు రక్ష పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు పోలీసులు స్పందించారు. తమ నిర్దిష్ట ప్రాంతం వివరాలు మరియు నంబరు ఇవ్వాలని ఆమెను కోరారు.