Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
- నూనె చుక్క కూడా ఉపయోగించకుండా ఎయిర్ ఫ్రైయర్తో పూరీలు..
- నూనెకు బదులుగా నీరు, ఆవిరి సహాయంతో పూరీలు..
- పూరీలను ముందుగా మరిగే నీటిలో వేసి ఉడికించి, తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil-Free Poori: మనలో చాలామందికి పూరీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వాటిని నూనెలో వేయించి తినడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం లాంటి సమస్యలు వస్తాయని భయపడి కొంతవరకు దూరంగా ఉంటారు. నిజానికి ఇకపై అలాంటి భయం అవసరం ఏమాత్రం లేదు. నూనె పూర్తిగా వాడకుండానే.. నీళ్లు, ఎయిర్ ఫ్రైయర్ సహాయంతో రుచికరమైన, పొంగిన పూరీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. డైట్ చేసేవాళ్లు కూడా వీటిని హాయిగా తినవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా..
సాధారణ పూరీలు నూనెలో వేయించడం వల్ల అధిక కేలరీలు, ఊబకాయం ప్రమాదం పెరుగుతాయి. కానీ ఈ పద్ధతిలో నూనె బదులు నీళ్లు, ఆవిరి ఉపయోగిస్తాం. కాబట్టి ఇది తేలికగా జీర్ణమయ్యేలా ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్లో చేయడం వల్ల పూరీలు బాగా పొంగి, క్రిస్పీగా వస్తాయి.
Also Read
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Bank Holiday: బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు.. పూర్తి వివరాలు ఇవే
కావాల్సిన పదార్థాలు:
* గోధుమ పిండి
* ఉప్పు
* 2 టీస్పూన్ల పెరుగు (నూనె లేకపోవడం వల్ల పిండి మెత్తగా ఉండటానికి)
* నీళ్లు
* ఎయిర్ ఫ్రైయర్
పిండి తయారీ:
మైదా పిండిలో ఉప్పు, పెరుగు కలిపి మెత్తని పిండి తయారు చేయండి. బాగా కలిపిన తర్వాత దానిని ఒక 15 నిముషాలపాటు ఒక గిన్నెలో పెట్టి పైన ఒక గుడ్డతో మూసేసి అలా ఉంచేయండి. ఆ తరువాత పిండిని చిన్న ఉండలు చేసి, పూరీలకు సరిపోయేలా సన్నగా ఒత్తుకోండి.
ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి మరగనివ్వండి. ఆ నీటిలో పూరీలను ఒక్కొక్కటిగా వేయండి. నీళ్లు మరిగేటప్పుడు పూరీలు పైకి తేలుతాయి. వాటిని అలాగే కాసేపు ఉంచి తీసేయండి. ఇప్పుడు వాటిని ఎయిర్ ఫ్రైయర్ లో 180 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేయండి. ఉడికించిన పూరీలను లోపల పెట్టి 3 నిమిషాలు ఉంచండి. అంతే పూరీలు చక్కగా పొంగి, బంగారు రంగులోకి వస్తాయి. ఈ సింపుల్ పద్ధతితో ఇంట్లోనే ఆయిల్ ఫ్రీ పూరీలు తయారు చేసుకుని, కుటుంబంతో కలిసి ఆనందంగా తినండి.
తాజావార్తలు
-
India vs Japan: అదరగొట్టిన తెలుగు అమ్మాయి.. 57 పరుగులకే జపాన్ ఆలౌట్!
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?