పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.ఓజీలో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికం గా ప్రకటించారు.. మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వారు తెలియజేశారు..మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ లో నే విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుక గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కాదు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతమైన టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదేవరకే ఒక అప్డేట్ ఇచ్చారు…ఈ టీజర్ ఉందని చెప్పినప్పటి నుండి ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు… దీంతో మేకర్స్ నిన్న ఓజి టీజర్ టైం ను ప్రకటించారు మేకర్స్.’ఓజి ‘ఆకలి తో ఉన్న పులి (హంగ్రీ చీతా) సెప్టెంబర్ 2 ఉదయం 10.35 గంటలకు రానుందని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం తో మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు గానే తాజాగా ఓజీ టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ క్యారెక్టర్ దుమ్ము రేపింది.అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో పవన్ ఎలివేషన్స్ అదిరిపోయాయి.ధమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా పై అంచనాలు పెంచేసింది. మొత్తానికి పవన్ బర్త్డే కానుక గా ఓజి టీం అదిరిపోయే కానుక ఇచ్చింది.
https://www.youtube.com/watch?v=7Y5q41D8_hs