Site icon NTV Telugu

TheyCallHimOG : సుజీత్ – దానయ్య కు మధ్య గొడవలు.. కీలక ప్రకటన చేసిన దర్శకుడు

Sujeth

Sujeth

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచుకుంది. వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పవర్ స్టార్ కెరీర్ లో హయ్యాస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Also Read : Raashii Khanna : రాశిఖన్నా.. ఉన్నది కూడా పోయింది.. ఇక పవర్ స్టార్ ఆదుకోవాలి

అయితే ఈ చిత్ర దర్శకుడు సుజీత్ కు నిర్మాత దానయ్య కు మధ్య మనస్పర్థలు వచ్చాయని అందుకే DVV బ్యానర్ లో స్టార్ట్ అయిన నాని – సుజిత్ సినిమా నుండి దానయ్య తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. OG సినిమాకు గాను సుజీత్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా దానయ్య ఇవ్వలేదని నెట్టింట ఒకటే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుజిత్ స్పందిస్తూ ‘ సోషల్ మీడియాలో చాలా చెబుతున్నారు, కానీ సినిమాను స్టార్టింగ్ నుండి ఫినిష్ చేసే వరకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. OG కోసం నా నిర్మాత మరియు నా టీమ్ ఇచ్చిన సపోర్ట్ మరియు నమ్మకాన్ని నేను మాటల్లో చెప్పలేను. OG సినిమా పట్ల పవన్ కళ్యాణ్ తో పాటు అయన అభిమానులు చూపించిన అమితమైన ప్రేమ వర్ణించలేనిది. దానయ్య నాకు ఇచ్చిన సపోర్ట్ మరియు నమ్మకానికి ఆయనకు నా కృతజ్ఞతలుప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతతో సుజిత్’ అని అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేసాడు.

Exit mobile version