Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Officials Issues First Danger Alert At Bhadrachalam Due To Godavari Floods

Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Published Date :July 20, 2023 , 3:50 pm
By Mahesh Jakki
Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి వరద నీరు చేరుకుంటోంది. అదేవిధంగా భద్రాచలం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున గోదావరిలోకి నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో ఇప్పటికే పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాద్రి రామయ్య ఆలయ పరిసరాల్లోనూ కుండపోత వర్షాలకు నీరు చేరడంతో.. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అన్నదాన సత్రం వద్ద వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: TSSPDCL CMD: వర్షాకాలంలో విద్యుత్‌తో జాగ్రత్త.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

భద్రాచలం పట్టణంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీళ్లన్నీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పక్కనే ఉన్న పడమర మెట్ల వద్దకు చేరుకున్నాయి. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలిసి ఆలయం పడమర వీధుల్లోకి చేరుకున్నాయి. పడమర మెట్లు ఎక్కి టెంపుల్‌లోకి వెళ్లడానికి వీలు లేకుండా నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా అన్నదాన సత్రం చుట్టూ కూడా నీళ్లు చేరడంతో అన్నదాన సత్రంను మూసివేశారు . అదేవిధంగా దుకాణ సముదాయాలకి చుట్టూ నీళ్లు చేరటంతో దుకాణాలు మూసివేశారు.

భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరికి వరద పోటెత్తిన నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఎప్పటికప్పుడు పరిసర గ్రామాల పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా.. కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రాణహాని జరగకుండా తగు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. జాలర్లు నదిలో చేపలవేటకు వెళ్లొద్దని, ప్రజలు కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న రహదారులపై ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhadrachalam
  • First Danger Alert
  • Godavari at Bhadrachalam
  • godavari floods
  • godavari river

తాజావార్తలు

  • Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!

  • Adivi Sesh : స్టార్‌ డైరెక్టర్స్‌ స్టార్స్‌ను మాత్రమే డైరెక్ట్‌ చేస్తారా?

  • Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions