NTV Telugu Site icon

Janhvi Kapoor-RC16: ఇట్స్ ఆఫీషియల్.. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్‌! పుష్ప 2లో కూడా

Janhvi Kapoor Rc16

Janhvi Kapoor Rc16

Janhvi Kapoor joins Ram Charan in Buchi Babu’s Movie: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంచర్’ మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ కానున్నాడు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. నేడు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విషయం చెప్పేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చే సినిమలో చరణ్‌కు జోడీగా జాన్వీ నటించనుందని ఆమె తండ్రి బోనీ కపూర్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. చరణ్, జాన్వీ పెయిర్ ఎలా ఉండబోతుందో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. వెండి తెరపై చిరంజీవి-శ్రీదేవిలది హిట్ కాంబినేషన్. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో వీరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు వారి వారసులు జోడీగా తెరపై సందడి చేయబోతుండడం విశేషం.

Also Read: IPL 2024: హైదరాబాద్‌కు చేరుకున్న సన్‌రైజర్స్‌ ప్లేయర్స్.. ఉప్పల్‌లో ప్రాక్టీస్‌ షురూ!

జాన్వీ కపూర్‌ ఇప్పటికే ఓ సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర’తో తెలుగు ప్రేక్షకులకు జాన్వీ పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పుష్ప 2 లో కూడా జాన్వీ కపూర్‌ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పుష్ప: ది రూల్‌లో జాన్వీతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని భావిస్తున్నారట. ఈ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది.