Site icon NTV Telugu

Off The Record: దానం నాగేందర్ సైలెంట్ అయ్యారా? అసలు కారణాలేంటి?

Otr (2)

Otr (2)

Off The Record: ధూం…ధాం, వాడెవ్వడు వీడెవ్వడు అంటూ… ఆ మధ్య నానా హంగామా చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు సడన్‌గా సైలెంట్‌ అయిపోయారు? ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దానం నాగేందర్‌ వాయిస్‌ ఈమధ్య కాలంలో వినిపించకపోవడానికి కారణం ఏంటి? ఓ పెద్దాయన షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి భవిష్యత్‌ బొమ్మ చూపించారన్నది నిజమేనా? ఎవరా పెద్దాయన? ఏం చెప్పి నోరు మూయించారు?

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ గడిచిన కొద్ది రోజుల నుంచి సైలెంట్‌గా కనిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక కొంత దూకుడుగానే వ్యవహరించారాయన. హైడ్రాతో పాటు.. పోలీస్ అధికారులు,జీహెచ్ఎంసీ ఆఫీసర్స్‌ వ్యవహార శైలి మీద మీడియా ముందే చేసిన వ్యతిరేక కామెంట్స్‌తో ప్రభుత్వ పెద్దలు కూడా కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించారు. అసలు ఒక దశలో అయితే… దానం నాగేందర్‌ను చేర్చుకుని కోరి తలనొప్పి తెచ్చుకున్నామా అన్న ఫీలింగ్‌ కూడా వచ్చిందట పీసీసీ పెద్దలకు.

Off The Record: జూబ్లీహిల్స్ జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతుంది?

సొంత పార్టీ నేతల నుంచి రాని ఇబ్బందులు బయట నుంచి వచ్చిన వాళ్లతో మొదలయ్యాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఆ వ్యవహారం అలా నడుస్తుండగానే… బీఆర్‌ఎస్‌ వేసిన అనర్హత పిటిషన్ల అంశం తెరమీదకి రావడంతో దానం దూకుడు కాస్త తగ్గింది. అదే సమయంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రచారం కూడా జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూలు కంటే ముందే ఖైరతాబాద్‌లో రాజీనామా చేసి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని లీకులు కూడా ఇచ్చారు దానం.

కానీ… అలాంటి చిన్నెలకు ఛాన్స్‌ లేదమ్మా అంటూ… కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించాక పూర్తిగా కామ్‌ అయిపోయారు ఎమ్మెల్యే. ఆ ఎపిసోడ్‌ అలా నడుస్తున్న టైంలోనే… ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ పెద్దాయన నాగేందర్‌ని పిలిచి…. ఆయన భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారట. ఓవైపు అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న క్రమంలో….. అట్నుంచి ముప్పు పొంచి ఉంది. మరో వైపు.. చేరిన పార్టీని ఇరకాటంలోకి నెట్టడం లాంటి చర్యలతో సాధించేదేం లేదని ఆ పెద్దాయన ఐ మ్యాక్స్‌ రేంజ్‌లో సినిమా చూపించినట్టు తెలిసింది.

Snapdragon 8 Elite చిప్‌, 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో iQOO Neo11 లాంచ్..!

అందుకే కిమ్మనకుండా.. కామైపోయినట్టు సమాచారం. త్వరలోనే అనర్హత వేటుపై క్లారిటీ రాబోతోంది. ఒక వేళ ఉప ఎన్నికంటూ వస్తే…నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పెట్టడంవల్ల ఆ బైపోల్‌ను సవ్యంగా ఎదుర్కోగలవా? అసలు టిక్కెట్‌ సంగతేంటి? పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి టిక్కెట్‌ సాధించగలనని అనుకుంటున్నావా అంటూ… సూటిగా, సుత్తి లేకుండా చెప్పి… భవిష్యత్‌ చిత్రాన్ని ఆవిష్కరించారట ఆ పెద్ద. ఆ దెబ్బకు దానం జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నట్టు సమాచారం. ఆ దెబ్బకు అంతా సెట్‌రైట్‌ అయిందని, ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే మౌనంగా ఉండటానికి అదే కారణం అని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు.

Exit mobile version