NTV Telugu Site icon

Off The Record : T-BJP పరిస్థితి AP BJP కంటే ఎందుకంత దారుణంగా ఉంది?

Otr Tbjp

Otr Tbjp

సభ్యత్వ నమోదు ఆ పార్టీ లోని కొందరు నేతలకు టెన్షన్ పుట్టిస్తుంది అట… టార్గెట్ రీచ్ అయ్యేందుకు తంటాలు పడుతున్నారు అట… ఒకరిద్దరు నేతలు అయితే సభ్యత్వం చేయించే బాధ్యతను ఏకంగా ఏజెన్సీలకే అప్పగించారు అట… మరికొందరు సభ్యత్వం చేయిస్తే డబ్బులు ఆఫర్ చేస్తున్నారు అట…. పార్టీ లో ఇదేమి కల్చర్ అనే చర్చ జరుగుతుంది. తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదుపై డ్రైవ్ జోరుగా నడుస్తోంది. పెట్టుకున్న టార్గెట్‌కు…చాలా దూరంలో ఉంది తెలంగాణ బీజేపీ. 50 లక్షల టార్గెట్ పెట్టుకుంటే…అందులో సగం కూడా రీచ్ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే కూడా తెలంగాణలో చాలా తక్కువగా కొత్త సభ్యత్వాలు నమోదయ్యాయి. ఎన్ని స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టినా…సభ్యత్వ నమోదు మాత్రం ఊపందుకోవడం లేదట. పార్టీలోని ముఖ్య నేతలకు సభ్యత్వ నమోదు ఒక గండంగా మారిందని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు…కొత్తగా పార్టీ సభ్యత్వం చేర్పించేందుకు నానాలు తంటాలు పడుతున్నారు. పార్టీ శ్రేణులు హార్ట్‌ఫుల్‌గా సభ్యత్వ నమోదులో పాల్గొనడం లేదట. ఈ నెల 24 వరకు సభుత్వ నమోదుకు గడువు ఇచ్చింది పార్టీ నాయకత్వం. ఆ లోపు టార్గెట్ రీచ్ అవడం కష్టమే.

ఎంపీ, ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలకు…సభ్యత్వ ఇన్‌చార్జ్‌లుగా కమలం పార్టీ నియమించింది. టార్గెట్ రీచ్ అయ్యేందుకు…తమ ప్రాంతం టాప్‌లో ఉండాలనే ఉద్దేశ్యంతో ఒకరిద్దరు నేతలు…ఏజెన్సీలకి సభ్యత్వం చేయించే బాధ్యతను అప్పగించారట. ఆ ఏజెన్సీలే ఆ నేతల నియోజకవర్గాల్లో సభ్యత్వం చేయించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇంకొందరు ఎవరైనా తన రెఫరల్ కోడ్‌పైన సభ్యత్వం చేయిస్తే డబ్బులు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారట. ఇంత మందిని చేర్పిస్తే…ఇంత డబ్బు ఇస్తామని చెబుతున్నారు కొందరు బీజేపీ నేతలు. పేరుకే రాష్ట్ర స్థాయి నేతలు కానీ…సొంతంగా ఓ వంద మందిని కూడా చేర్పించలేక పోతున్నారట. ఏజెన్సీలకు ఇచ్చి…పార్టీ సభ్యత్వం చేయించడంపై కమలం పార్టీలో రకరకాల చర్చ జరుగుతోంది. కొత్తగా ఇలాంటి కల్చర్ ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట ఇన్‌చార్జ్‌ అభయ్ పాటిల్ దగ్గర కూడా ఈ ఇష్యూ పైన చర్చ జరిగిందట. ఏజెన్సీల ద్వారా పార్టీ సభ్యత్వం చేయిస్తున్నారని తెలుసుకున్న నేతలు…ముక్కున వేలేసుకుంటున్నారట. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూపై పార్టీ హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.