NTV Telugu Site icon

Off The Record : T-BJP ఓటమిపై MP Arvind తీవ్ర వ్యాఖ్యలు.. BJP నేతలనే టార్గెట్ చేసి అన్నారా?

Tbjp Otr

Tbjp Otr

అసెంబ్లీ ఎన్నికలైపోయి ఏడాది కావస్తున్న టైంలో ఆ ఎంపీకి ఓటమి పాఠాలు గుర్తుకు వచ్చాయా? మనం గెలవకపోవడానికి బాధ్యులు ఎవరంటూ కొత్తగా ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారు? పార్టీలోనే ముఖ్యులు ఎవరినన్నా టార్గెట్‌ చేశారా? లేక ఆయన కీలక పదవి ఏదన్నా ఆశిస్తూ సంచలనం రేపాలనుకున్నారా? తెలంగాణ కాషాయ దళంలో ఇంటర్నల్‌గా ఏం జరుగుతోంది? వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ ఎంపీ ఎవరు? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్…. ఎప్పుడూ రాష్ట్రంలో అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ… సంచలన ప్రకటనలు చేసే ఎంపీ… ఈసారి సొంత పార్టీ బీజేపీ విషయంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ కాషాయ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందట ఆ మాటల మీద. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనుకున్న పార్టీ కేవలం 8 సీట్లకే ఎందుకు పరిమితం అయిదంటూ ఇప్పుడు కొత్తగా చర్చ లేవదీశారు అర్వింద్‌. ఈ మాటల్ని ఆయన కావాలనే అన్నారా? లేక కాకతాళీయంగా అన్నారా అని ఆరా తీస్తున్నాయట పార్టీ వర్గాలు. ఒకవేళ ఉద్దేశ్యపూర్వకంగానే అని ఉంటే…. తెలంగాణ బీజేపీలో ఆయన ఎవర్ని టార్గెట్‌ చేసి ఉండవచ్చని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అటు రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. ఓట్లు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నప్పటికీ… ఎందుకు వేయించుకోలేకపోయామో ఆలోచించాలని అన్న మాటలు ఇండైరెక్ట్‌గా ఎవరినో టార్గెట్‌ చేస్తున్నట్టుగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. గ్రేటర్ హైదరాబాద్‌లో 48 కార్పొరేటర్‌ సీట్లు గెలిచిన బీజేపీ.. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఎందుకు గెలవలేకపోయిందో ఆలోచించుకోవాలని, ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించడంపై పార్టీలో హాట్‌ హాట్‌ డిబేట్‌ మొదలైందట. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఎంపీ.. ఒక్కసారిగా ఇలా సొంత పార్టీ మీదికే ప్రశ్నాస్త్రాలు సంధించడంతో అసలు తెలంగాణ కాషాయ పార్టీలో ఏం జరుగుతోందంటూ రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా చూస్తున్నాయట. ఏ నాయకుడి పేరు ఎత్తకుండా చేసిన వాఖ్యల మర్మం ఏంటంటూ ఇటు ఎంపీ అనుచరులు, అటు పార్టీ క్యాడర్ ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న అర్వింద్‌….పార్టీ స్టార్ క్యాంపెయినర్స్‌ లిస్ట్‌లో ఉన్నారు.

ఎన్నికల టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా పర్యటించి ప్రచారం చేశారు. అయినా ఇప్పుడు బాధ్యులు ఎవరంటూ… ప్రశ్నించడంతో… ఆయన కావాలనే ఎవరినో టార్గెట్‌ చేశారా అన్న చర్చ సైతం జరుగుతోందట పార్టీ వర్గాల్లో. అనుచరులు మాత్రం అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ 8 సీట్లకే పరిమితం అయిందన్న ఆవేదనతోనే ఎంపీ అలా అన్నారంటూ వివరణ ఇచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి అదే నిజమైతే… ఈ విషయాన్ని ఎన్నికలై ఏడాది కావస్తున్న టైంలో ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. ఇన్నాళ్ళు అర్వింద్‌కు ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించే వాళ్ళు పార్టీలోనే ఉన్నారన్నది ఇంటర్నల్‌ టాక్‌. అదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. అర్వింద్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట. గతంలో పార్టీ అధ్యక్ష పదవి రేసులో చివరి వరకు ఉండి ప్రయత్నం చేశారు అర్వింద్. కానీ కొద్దిలో ఛాన్స్ మిస్‌ అయ్యిందట. త్వరలో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో.. ముందు చూపుతోనే… ఆయన ఈ కామెంట్ చేశారా..? లేక అంతకు మించి ముఖ్య నేతలు ఇంకెవరినైనా టార్గెట్ చేశారా అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ అంటున్నాయి పార్టీ వర్గాలు. కారణం ఏదైనా… అర్వింద్ వాఖ్యలు ఇప్పుడు కాషాయ పార్టీలో దూమారం రేపుతున్నాయి. ఎంపీ వ్యాఖ్యలు ఎట్ముంచి ఎటు పోతాయో…. ఆ మాటల తూటాలు చివరికి ఎవరికి తగులుతాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.