Off The Record : ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఎమ్మెల్యే ఏదో…… గొప్పగా…… సెటైరికల్‌గా మాట్లాడదామనుకుంటే….. చివరికి సుర్రు సుమ్మైపోయిందా? మాటలు మిస్ ఫైర్ అయిపోయి అట్రాసిటీ కేసు పెట్టించుకునేదాకా వెళ్ళాయా? ఫైనల్‌గా జంక్షన్ జామైపోయే పరిస్థితులు వచ్చాయా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ మాటలు బూమరాంగ్ అయ్యాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలోని వ్యవహారాలు ఆయన మీద అట్రాసిటీ కేసు బుక్ చేసేదాకా వెళ్లాయట. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌ని ఉద్దేశించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ…. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేశారు ఎల్బీనగర్ పోలీసులు. అదేంటీ… ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అలా ఎలా నోరు జారారని అంటే…. ప్రోటోకాల్ దగ్గర మొదలైన వివాదం అంత దూరం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈనెల 12న మన్సూరాబాద్ డివిజన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే… అవే పనులకు తిరిగి తాను కొబ్బరికాయలు కొట్టారు బీజేపీ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి. దానిమీద బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్ అయ్యారు. మరోచోట కూడా ఇలాగే శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకుని నిరసన తెలిపారు. వాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్‌కు తరలించారు. ఆ సమయంలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లను పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ వెళ్ళారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌పై సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడుల వెనుక మధుయాష్కి ఉన్నారని ఆరోపించారు. అదే సమయంలో… బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్మింహా రెడ్డి, వంగ మధుసూదన్‌కు, యాష్కికి మధ్య హనీమూన్ నడుస్తోందన్నారు. అక్కడితో ఆగకుండా…. హస్తినాపురం కార్పొరేటర్‌తోనూ హనీమూన్ నడుస్తోందని అనడంతో అగ్గి అంటుకుంది. ఒక మహిళను పట్టుకుని ఇతరులతో హనీమూన్ నడుస్తోందని అంటావా అంటూ భగ్గుమన్నారు హస్తినాపురం బీజేపీ నాయకులు.
ఈ కామెంట్స్‌ను కార్పొరేటర్ సుజాత నాయక్ ఖండించారు. సుధీర్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పీఎస్‌తో పాటు మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఉద్దేశ్యం ఏదైనా… మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండవద్దా అన్నది క్వశ్చన్. . ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ యుద్ధం గట్టిగానే నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ చిన్న చిన్న విషయాలకు పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే బానోతు సుజాత బీజేపీలో గెలిచి బిఆర్ఎస్ లో చేరి… స్థానిక ఎమ్మెల్యేతో విభేదించి ప్రస్తుతం కాంగ్రెస్ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ నేత మధుయాష్కీ ప్రోద్బలంతోనే తనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే వాపోతున్నారట. ఎమ్మెల్యే బిఆర్ఎస్, మెజార్టీ కార్పొరేటర్లు బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎల్బీ నగర్లో ట్రయాంగిల్ ఫైట్ గట్టిగానే నడుస్తోంది. అందుకే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లను ఉద్దేశించి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను కార్పొరేటర్ సీరియస్ గా తీసుకున్నారని, దాని పర్యవసానమే ఈ కేసులని అంటున్నారు. ఈ పొలిటికల్ వార్‌లో ముందు ముందు ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి.
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
- Tags
- ntv
- OTR
- sudheer reddy
తాజావార్తలు
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్‌టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!