Off The Record : కూటమి సునామీని సైతం తట్టుకుని గెలిచిన ఆ YCP నేత పార్టీ మారుతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ వేవ్‌ను తట్టుకుని నిలబడ్డ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గానికి కనీసం గెస్ట్‌గా కూడా రావడం లేదు. ఫలితాలు వచ్చాక జస్ట్ ఒకసారి అలా కనిపించి మాయమైపోయారు. పనుల కోసం సొంత పార్టీ వాళ్ళు ఫోన్ చేసినా… స్పందించకుండా.. కూల్ కూల్ అంటూ శాంతి మంత్రం జపిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన పార్టీ మారతారన్న ప్రచారంలో నిజమెంత? కూటమి సునామీలో కూడా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు బాలనాగిరెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ కేవలం రెండు సెగ్మెంట్స్‌లో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి మంత్రాలయం కాగా రెండోది ఆలూరు. అయితే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దర్శనమే నియోజకవర్గ ప్రజలకు కరవైందట. ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు బాలనాగిరెడ్డి. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. దీంతో అనర్హత వేటు పడింది. ఇక 2014, 2019, 2024లో వరుసగా వైసీపీ తరపున గెలిచారాయన. కానీ…టీడీపీ గాలిలోనూ గెలిపించిన ఓటర్లకు గాని, పార్టీ క్యాడర్ కు గానీ ఇప్పుడు అందుబాటులో లేకుండా పోవడంపై చర్చించుకుంటున్నారు స్థానికులు. ఫలితాల తర్వాత కొద్ది రోజులు మాత్రమే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ఆ తర్వాత హైద్రాబాద్ బాటపట్టి ఇక తిరిగి రాలేదట. ఫలితాలు వచ్చి నెల రోజులవుతున్నా… నియోజకవర్గంలో కనీసం ఓ మీటింగ్ పెట్టలేదని, దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్న పరిస్థితి.
ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే తమ గురించి పట్టించుకోవడం లేదన్న అసహనం కేడర్‌లో పెరుగుతోందంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో… స్థానికంగా పార్టీ కేడర్‌కు అందుబాలో ఉంటూ భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది నియోజకవర్గంలో. సెగ్మెంట్‌లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, రేషన్ డీలర్ పోస్టులను లాక్కునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంటే వైసీపీ క్యాడర్ కు అండగా ఎవరూ లేరని, పార్టీ అధికారంలో ఉంటేనే ఎమ్మెల్యే అండగా ఉంటారా అని మాట్లాడుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు. కొందరు స్థానిక నాయకులు ఆగలేక శాసనసభ్యుడికి ఫోన్ చేస్తే… సైలెంట్ గా ఉండండి, మన ప్రభుత్వం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు పెట్టించుకోవద్దని ఉచిత సలహా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ధైర్యం నింపాల్సిన ఎమ్మెల్యేనే నియోజకవర్గంలో లేకుండా పోవడంతో పాటు ఇలా గాలికి వదిలేస్తే… గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆక్రోశిస్తున్నారట వైసీపీ కార్యకర్తలు. అలాగే ప్రజల సమస్యల మీద ఎవరిని అడగాలన్న క్వశ్చన్ కూడా వస్తోందని అంటున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తే…దానికి కూడా వెళ్లలేదట బాలనాగిరెడ్డి. మీటింగ్ అయిపోయాక విడిగా వెళ్ళి జగన్‌ను కలిసినట్టు తెలిసింది. అదే సమయంలో మరో సమస్య కూడా వస్తోందంటున్నారు స్థానిక నాయకులు. మీ ఎమ్మెల్యే పార్టీ మారతారట కదా అని ఎవరైనా అడిగితే… ఏం సమాధానం చెప్పాలో అర్ధంగాక దిక్కులు చూడాల్సి వస్తోందని బాధ పడుతున్నట్టు తెలిసింది. అయితే అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని, ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని అంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. దీంతో ఎమ్మెల్యే మనసులో ఏముంది? ముందు ముందు ఆయన ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు మంత్రాలయం నియోజకవర్గంలో.
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- IMD: భారత్‌కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
తాజావార్తలు
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
-
Lenin Movie Postponed : “లెనిన్” రిలీజ్ వాయిదా… జూలై సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!