NTV Telugu Site icon

Off The Record : వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు నియోజకవర్గం మార్పుపై YS Jagan కు ఏం చెప్పారు?

Otr Kannababu

Otr Kannababu

ఆ మాజీ మంత్రి పక్క జిల్లాలో సీటు పై ఫోకస్ చేశారా ? ఇప్పటి నుంచే అక్కడకి షిఫ్ట్ అయిపోతానని అధినేత ముందు రిక్వెస్ట్ పెట్టారా? ఆశించిన స్థాయిలో రెస్పాండ్ రాకపోవడంతో వేరే లెక్క వేస్తున్నారా? తాను రెండుసార్లు గెలిచిన నియోజకవర్గంలో అంత ఇంట్రెస్ట్ లేదా ? కురసాల కన్నబాబు…జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంలో చేరి… 2009లో కాకినాడ రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి…ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ రూరల్‌ నుంచి రెండోసారి గెలుపొంది…జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో…వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడ జనసేన అభ్యర్థి పంతం నానాజీ విజయం సాధించారు. మంత్రిగా పని చేసిన సమయంలో విశాఖ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రస్తుతం వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పదవిలో కన్నబాబు…అంత కంఫర్ట్‌గా లేరనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంతగా యాక్టివ్‌గా ఉండడం లేదు. వైసీపీలోనే కొనసాగాలని అనుకున్నప్పటికీ….కాకినాడ జిల్లాపై మాత్రం ఇంట్రెస్ట్‌ తగ్గిపోతోందట. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి వెళ్లేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేశారని అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే జగన్ ముందు కూడా ప్రస్తావించారట. కన్నబాబు ప్రతిపాదనపై వైసీపీ అధినేత జగన్‌…మాత్రం పెద్దగా స్పందించలేదని చర్చ జరుగుతుంది. తనకు విశాఖ జిల్లాలో పరిచయాలు ఉన్నాయని…అక్కడ అయితే ఈజీగా ఉంటుందని అన్నారట.

ఎన్నికల ముందు కూడా కన్నబాబు పెందుర్తికి కూడా ప్రచారం జరిగింది.. కానీ ఆయన కాకినాడ రూరల్ నుంచే పోటీ చేశారు…ఇప్పుడు మాత్రం ఇక షిఫ్ట్ అయిపోవడమే బెటర్ అని లెక్కలు వేస్తున్నారట. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ…డాక్టర్‌పై దాడి చేయడం గత నెలలో పెద్ద దుమారమే రేపింది. తన నియోజకవర్గం అయినప్పటికీ పెద్దగా స్పందించలేదు కన్నబాబు. స్టేట్ మొత్తం షేక్ అయ్యే వ్యవహారం అయినప్పటికీ లైట్ తీసుకున్నారు. అదేంటి స్కోరింగ్ ఇష్యూలో కన్నబాబు ఎలా వెనకబడిపోయారు అనే గుసగుసలు వినిపించాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసిపి మాజీ మంత్రి బొత్స ను బరిలోకి దింపింది.. అప్పుడు ఎన్నికలు జరుగుతాయేమో అనే కోణంలో కన్నబాబు కూడా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో కూడా ఈ ప్రస్తావని తీసుకుని వచ్చారట. బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికైనందున తాను కూడా ఉంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్‌…పార్టీకి కలిసి వస్తాయని అన్నారట. ఎమ్మెల్సీ సత్తిబాబుతో కూడా రాయబారం నడుపుతున్నట్లు అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ పెద్దల నుంచి తప్పని పరిస్థితుల్లో మాట్లాడమంటే మాట్లాడడానికి పరిమితం అయిపోతున్నారు కన్నబాబు. తాను పాలిటిక్స్ చేయడానికి అంత అనుకూలమైన వాతావరణం లేదని ఓపెన్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. తన మనసులో ఉన్నది చెప్పేశానని…పార్టీ పెద్దలే దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారట. పెందుర్తిలో ఇప్పటి నుంచే ఫైట్ చేస్తే…ఆ లెక్క వేరే ఉంటుందని క్లారిటీ ఇచ్చేస్తున్నట్లు సమాచారం. ఒకసారి ఇంట్రెస్ట్ పోయినప్పుడు పని చేయలేమని కన్నబాబు చెబుతున్నారట. వెయిట్ అండ్ సీ…పార్టీ విల్ బీ డిసైడ్ అని అనుచరులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. తన ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా షిఫ్ట్ చేయాలని తెగ పైరవీలు చేస్తున్నారు. సత్తిబాబుతో తాను సెట్ అయితే మరో విధంగా ఉంటుందని ఊదరగొట్టేస్తున్నారట. మరి కొత్త ఈక్వేషన్స్‌కి పార్టీ…ఏ మేరకు ప్రయారిటీ ఇస్తుందో చూడాలి