Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Kakani Govardhan Reddy

Off The Record : కాకాణి కేసులో వైసీపీ రివర్స్ ఎటాక్..? వైసీపీ నయా స్ట్రాటజీ ఏంటి..?

Published Date :June 2, 2025 , 9:26 pm
By Gogikar Sai Krishna
Off The Record : కాకాణి కేసులో వైసీపీ రివర్స్ ఎటాక్..? వైసీపీ నయా స్ట్రాటజీ ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో… వైసీపీ రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టిందా? మైనింగ్‌ అక్రమాలపై సీఐడీ కాదు…. సీబీఐతో దర్యాప్తు చేయించమన్న డిమాండ్‌ వెనక వ్యూహం ఉందా? అధికార పార్టీ మీద పైచేయి సాధించేందుకు ప్రతిపక్షం ఓ పద్ధతిలో అడుగులేస్తోందా? ఇంతకీ వైసీపీ నయా స్ట్రాటజీ ఏంటి? అది ఎంతవరకు వర్కౌట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్‌ ఎపిసోడ్‌ సినిమాలో ట్విస్ట్‌లను తలపించింది. అజ్ఞాతంలో ఉన్న కాకాణిని… వెదికి మరీ పట్టుకున్నారు పోలీసులు. పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ నుంచి క్వార్ట్జ్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని, అదంతా గోవర్ధన్ రెడ్డి కనుసన్ననలోనే నడిచిందంటూ కేసు బుక్‌ చేశారు పోలీసులు. ఇక 55 రోజుల తర్వాత ఆయన్ని బెంగళూరులో అరెస్ట్‌ చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అజ్ఞాతం నుంచి అరెస్ట్‌దాకా…. ప్రతి సందర్భంలోనూ ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు. ఫైనల్‌గా 14 రోజుల రిమాండ్‌ పడింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి పీకల్లోతున ఇరుక్కుపోయారని మాట్లాడుకుంటున్న టైంలో…వ్యూహం మారుస్తోందట వైసీపీ జిల్లా నాయకత్వం. ఆయన తప్పు చేశారనేదానికంటే… ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రచారం ద్వారా సానుభూతి కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితే…. గోవర్ధన్ రెడ్డికి కూడా ఎదురవుతుందని ఊహించిన నెల్లూరు వైసీపీ నాయకత్వం… అక్రమ కేసుల పేరుతో…ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటోందట. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఆయన్ని వేధించేందుకు కేసులు పెడుతోందన్న మెసేజ్‌ని జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందట పార్టీ. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్రను కూడా ప్రశ్నిస్తున్నారు జిల్లా వైసీపీ నాయకులు. ముందు డిపార్ట్‌మెంట్‌ని కార్నర్‌ చేస్తే…సగం సమస్య తీరిపోతుందన్నది వాళ్ల ఆలోచనగా తెలుస్తోంది. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా మీద సీబీఐ దర్యాప్తు జరపాలన్నది వైసీపీ లేటెస్ట్‌ డిమాండ్‌. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో.. కాకాణి కుమార్తె పూజిత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం కూడా ఇచ్చేశారు. కాకాణిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఓవైపు చెబుతూనే….. సీబీఐ దర్యాప్తు కోరడం ద్వారా….. అధికార పార్టీ నేతల మీద పైచేయి సాధించాలన్నది వైసిపి స్కెచ్‌గా తెలుస్తోంది.

ఈ విషయంలో ఒకసారి సీబీఐ అంటూ రంగంలోకి దిగితే… కొంతమంది టీడీపీ నేతల వ్యవహారాలు కూడా బయటికి వస్తాయన్నది వైసీపీ అంచనా అట. అందుకు తగ్గట్టే… సీబీఐ డిమాండ్‌ తెర మీదికి వచ్చాక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డైలమాలో పడ్డారన్నది లోకల్‌ టాక్‌. కాకాణి కేసుకు సంబంధించి వైసీపీ రివర్స్ కౌంటర్ వేస్తున్నా…. జిల్లా టీడీపీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మినహా మిగిలిన వారంతా కాకాణి విషయంలో గమ్ముగానే ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులో A1, A2, A3కి బెయిల్ రావడం, A4గా ఉన్న మాజీ మంత్రి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో… ఇదే విషయాన్ని హైలైట్‌ చేస్తున్నారు జిల్లా ఫ్యాన్‌ పార్టీ లీడర్స్‌. దీని ద్వారా కుట్ర పూరితంగా కాకాణిని ఇరికించారన్న భావనను బాగా వ్యాప్తి చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అటు ఎమ్మెల్యే సోమిరెడ్డి మాత్రం కాకాణి పాపం పండిందని, తెల్ల రాయిని కొల్లగొట్టడం వల్లే ఆయన జైల్లో ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… ఒకసారి దొరికారు కాబట్టి… మాజీమంత్రిని మరిన్ని కేసుల్లో విచారణ పేరుతో ఇబ్బంది పెడతారని ముందే ఊహించిన వైసీపీ మాత్రం కౌంటర్స్‌ రెడీ చేసుకుంటోందట. క్వార్ట్జ్‌ కేసులో సీబీఐ విచారణ కోరడం ద్వారా…. గోవర్ధన్‌రెడ్డి ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో సింహపురి రాజకీయం మాంఛి రకసకందాయంలో పడుతోంది. వైసీపీ ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ స్ట్రాటజీని ప్రజలు నమ్ముతారా..? దాన్ని టీడీపీ ఎలా కౌంటర్‌ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kakani govardhan reddy
  • NTV Telugu
  • off the record

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions