NTV Telugu Site icon

Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?

Otr Go 29

Otr Go 29

తెలంగాణలో జీఓ 29 దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి గుదిబండ కాబోతోందా? బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుంటోందా? వివాదం ముదిరితే ఏకంగా రాహుల్‌ గాంధీనే మాట్లాడటానికి ఇరుకున పడే ప్రమాదం ఉందా? ఇంతకీ ఏంటా జీవో 29? దానితో కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? జీఓ నంబర్‌ 29ని రద్దు చేయాలని, జీఓ 55ను అమలు చేయాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు గ్రూప్‌ వన్‌ అభ్యర్థులు. దాని కోసం కోర్ట్‌కు వెళ్ళారు కూడా. జీఓ 29తో నాన్ లోకల్ అభ్యర్థులకు లబ్ది చేకూరుతుందని, అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందంటూ మొత్తుకుంటున్నారు అభ్యర్థులు. ఇది పూర్తిగా రిజర్వేషన్స్‌తో ముడిపడ్డ అంశం కావడంతో… కాస్త లేటుగానైనా… సీరియస్‌గా తీసుకోవాలనుకుంటోందట బీజేపీ. అందులో భాగంగానే.. సీరియస్‌గా, ఒకింత ఘాటుగా స్పందిస్తున్నారు కిషన్‌రెడ్డి, బండి సంజయ్. ఉన్నట్టుండి అంత సీరియస్‌గా ఎందుకంటే… దేశ వ్యాప్తంగా బీజేపీ రిజర్వేషన్స్‌ని ఎత్తేస్తుందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, దానికి కౌంటర్‌గానే తెలంగాణలో జీవో 29 రూపంలో అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది.

ఆ జీవోతో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం జరుగుతుందన్నది బీజేపీ వెర్షన్‌. దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లు, కుల గణనపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు బీజేపీ నాయకులు. దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లు, అన్యాయం గురించి మాట్లాడున్న మీరు…. తెలంగాణలో మీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్‌ 29 పై ఎందుకు మాట్లాడరన్నది రాహుల్‌ గాంధీకి బీజేపీ నేతల సూటి ప్రశ్న అట. అసలు 29 జీవో ద్వారా తెలంగాణలో రిజర్వేషన్లు సరిగా అమలవకుండా అడ్డుకుంటున్నారంటూ రాహుల్‌ టార్గెట్‌గా రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టింది బీజేపీ. ఈ క్రమంలో కమలం పార్టీ తాజా ఆందోళనతో కొత్త చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయవర్గాల్లో. జీవో 29 భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి రాహుల్‌ గాంధీకి ఇబ్బందికరం కావచ్చని, డిఫెన్స్‌లో పడాల్సి వస్తుందన్నది కొందరు పొలిటికల్‌ పండిట్స్‌ విశ్లేషణ. దీన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని బీజేపీ స్కెచ్‌ వేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమై ప్రచారం సీరియస్‌గా జరిగితే…కాంగ్రెస్‌ ఇరుకున పడడం ఖాయమన్న వాదన బలపడుతోంది. అదే సమయంలో రేపు సుప్రీం కోర్ట్‌ ఈ జీవోకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితి ఏంటన్నది ఇంకో క్వశ్చన్‌. మొత్తంగా ఇలా ఎట్నుంచి ఎటు చూసుకున్నా… జీవో 29తో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. పార్టీ పెద్దలు దీన్ని ఎలా డీల్‌ చేస్తారో చూడాలి మరి.

 

Show comments