NTV Telugu Site icon

Off The Record : బీఆర్‌ఎస్‌ను దూకుడుగా నడిపించేందుకు కొత్త పోస్ట్ రెడీ? పోస్ట్ కోసం ఆ నేత ఉవ్విళ్లూరుతున్నారా?

Mlc Kavitha Otr

Mlc Kavitha Otr

బీఆర్‌ఎస్‌లో కొత్తగా అత్యున్నత స్థాయి పోస్ట్‌ ఒకటి క్రియేట్‌ కాబోతోందా? పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్ళేందుకు వీలుగా ఆ పదవి రెడీ అవుతోందా? ముఖ్య నేత ఒకరు ఆ పార్టీ పదవీ బాధ్యతల కోసం ఉవ్విళ్ళూరుతున్నారా? దాని గురించి ఇప్పటికే కేసీఆర్‌ దగ్గర చర్చ జరిగిందా? అసలే పోస్ట్‌ గురించి ఈ చర్చ అంతా? ఎవరా నేత? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇక దూకుడు పెంచాలని భావిస్తోందట బీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినందున ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడికక్కడ నిలదీస్తూ… తమ పార్టీకి పూర్వ వైభవం దిశగా గులాబీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అనుబంధ విభాగాల్ని కూడా యాక్టివేట్‌ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. తెలంగాణ జాగృతి తరపున కవిత ఇప్పటికే ముమ్మరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు జ్యోతిరావు పూలే ఫ్రంట్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేస్తూ బీసీలకు కూడా దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారామె. జైలు నుంచి వచ్చాక… కొన్నాళ్ళు కామ్‌గానే ఉన్నా… ఇటీవలి కాలంలో పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలతో పాటు సొంతగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తున్నారామె. అయితే… ఇలా బీసీ రిజర్వేషన్స్‌ మీద రౌండ్‌ టేబుల్‌ డిస్కషన్స్‌, జాగృతి పేరుతో ఇతర కార్యక్రమాలు ఎన్ని నిర్వహించినా….పెద్దగా ఉపయోగం ఉండదని, బీఆర్‌ఎస్‌ కీలక పదవిలో ఉండి ప్రోగ్రామ్స్‌ నిర్వహిస్తే… ఆ కిక్కే వేరని అంటున్నారట కవిత సన్నిహితులు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా…. ఆ పదవితో రాష్ట్రం మొత్తం తిరగడం కాస్త ఇబ్బందిగా ఉంటోందట. అందుకే… పార్టీలో స్టేట్‌ లెవల్‌ పోస్ట్‌, అది కూడా కీలకమైనది తీసుకోవాలన్న చర్చ జరుగుతోందట కవిత టీమ్‌లో. అందుకు తగ్గట్టే ఆమె కూడా సదరు కీలక పదవి గురించి… తండ్రి కేసీఆర్‌ దగ్గర ప్రస్తావించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. ఆ మధ్య పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కూడా కవిత ప్రస్తావన తీసుకువచ్చారు. తెలంగాణ జాగృతి తరఫున ఆమె కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు… పార్టీ కూడా సహకరించాలని చెప్పారు. ఆ తర్వాత జాగృతి ప్రోగ్రామ్స్‌ ఇంకా ఊపందుకున్నాయి. ఇక ఇదే ఊపులో….జాగృతి కన్నా… డైరెక్ట్‌గా పార్టీ రాష్ట్రస్థాయి పదవి తీసుకుని కవిత ప్రజల్లోకి వెళితే ఇంకా లాభం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట ఎమ్మెల్సీ శిబిరంలో. కవిత ఏం చేసినా… అంతిమ లక్ష్యం బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమేకాబట్టి… పెద్ద పదవితో పోరాడితే…. ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుందని అనుకుంటున్నారట.

ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. కవితకు కూడా ఆ స్థాయిలోనే ఓ పదవిని క్రియేట్‌ చేసి ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోందట కొన్ని సర్కిల్స్‌లో. ఖాళీగా ఉన్న సెక్రటరీ జనరల్ కానీ, లేదంటే… వైస్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా క్రియేట్ చేసిగానీ.. ఆ పదవిలో ఉండాలన్నది కవిత మనసులో మాటగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్‌కు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతానికి బీఆర్ఎస్ కంటే ఎక్కువగా
జాగృతి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇదే ఊపుతో పార్టీ పదవి తీసుకుని జనాల్లోకి వెళితే ఇంకా కలిసి వస్తుందని కేసీఆర్‌ని కన్విన్స్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడే ఇంకో సమస్య వస్తోందట. ఇప్పటికే బీఆర్ఎస్ మీద కుటుంబ పార్టీ ముద్ర ఉంది. తండ్రీ కొడుకులు ప్రెసిడెంట్‌, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని విమర్శిస్తున్నాయి విపక్షాలు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల్లో ఏదైనా ఏదైనా సాధ్యమేనన్నది ఇంకో వెర్షన్‌. ఇలా కవితకు బీఆర్‌ఎస్‌లో కీలక పదవి చుట్టూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. చివరికి నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి పార్టీ వర్గాలు.