NTV Telugu Site icon

Off The Record : ఆళ్లగడ్డలో అఖిలప్రియ vs శిల్పా చక్రపాణి రెడ్డి

Allagadda Otr

Allagadda Otr

ఎప్పుడూ హాట్‌ హాట్‌గా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయం ఇప్పుడు ఇంకా ఘాటుగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యేగా భూ యుద్ధం మొదలైంది. ఇద్దరిదీ ఒకే పార్టీ కాదు, ఒకే సెగ్మెంట్‌ కాదు… అయినా, యవ్వారం యమా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నాయకులు? ఆళ్ళగడ్డ…. ఆ పేరులోనే ఫైర్ ఉంటుంది. ఏదో ఒకరకమైన వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉంటుంది నంద్యాల జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గం. ఆ సిరీస్‌లోనే… తాజాగా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మధ్య కొత్తగా రచ్చ ఎపిసోడ్‌ మొదలైందట. వాస్తవానికి ఆళ్లగడ్డ, శ్రీశైలం పక్కపక్క నియోజకవర్గాలు కూడా కాదు. వాళ్లిద్దరూ ఒకే పార్టీలో లేరు. అలాంటప్పుడు గొడవేంటి? రచ్చ ఎందుకనే డౌట్ రావడం కామన్‌. అందుకు బలమైన కారణాలే ఉన్నాయట. ఓ రియలెస్టేట్‌ వెంచర్‌ వ్యవహారం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టినట్టు తెలిసింది. నిబంధనలు పాటించలేదని, భూ కబ్జా చేశారని ఒకరు, అలా ఏంలేదు,..ఇది కేవలం రాజకీయ దాడేనని అని మరొకరు ఎవరి స్టాండ్‌ మీద వారు ఉండటంతో వ్యవహారం వీధికెక్కిందట. ఆ రచ్చ అలా అలా ముదిరి ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆళ్ళగడ్డలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. అందుకోసం ప్రభుత్వ భూమి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. గతంలోనే మాజీ మంత్రిగా ఆమె ఇవే ఆరోపణలు చేసినా…అప్పుడు పెద్దగా ప్రాధాన్యత రాలేదు. కానీ… మొన్నటి ఎన్నికల్లో అఖిల ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలవడం, అసెంబ్లీ సమావేశాల్లో శిల్పా రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రస్తావించడంతో ప్రాధాన్యత వచ్చింది. వెంచర్‌లో కేసీ కెనాల్‌కు సంబంధించిన కాలువ ఉందని, ప్రభుత్వ భూమి ఆక్రమించి, కాలువను మళ్లించి ప్లాటింగ్‌ వేశారంటూ సభలో ప్రస్తావించారు భూమా. ఎలాంటి అనుమతి లేకుండా, ఇష్టానుసారం శిల్ప వెంచర్స్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందన్నది ఎమ్మెల్యే వెర్షన్‌. దాదాపు 7 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాలువను మళ్లించారని ఆరోపిస్తున్నారు ఆమె.

ఈ ఆక్రమణకు సహకరించిన అధికారులపై కూడా వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా కోరారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే. కేవలం మాటలతో సరిపెట్టకుండా… అధికారుల ద్వారా ఆక్రమణలు తొలగించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ విషంలో మాజీ ఎమ్మెల్యే వెర్షన్‌ మరోలా ఉంది. ఎలాంటి భూ ఆక్రమణలు లేవని, ఎమ్మెల్యే అఖిలప్రియ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ విషయాన్ని రచ్చ చేస్తున్నారని అంటున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. నిబంధనల ప్రకారమే కాలువకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చి వెంచర్ వేశామని, అందులో ప్రభుత్వ భూమి ఏమి లేదన్నది ఆయన వాదనగా తెలిసింది. కేవలం రాజకీయ కారణాలతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారనేది ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెర్షన్‌. తమ సొంత ఖర్చులతో కాలువ నిర్మించాలన్న నీటిపారుదల శాఖ అధికారుల నిబంధనల ప్రకారమే వెంచర్ వేసినట్టు చెబుతున్నారట ఆయన. తమ వెంచర్ కారణంగా ఒక్క రైతు కూడా నష్టపోయే పరిస్థితి లేదని, గతంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో , ఇపుడు కూడా అంతే ఉందన్నది శిల్పా చక్రపాణి రెడ్డి వర్గం వాదన. ఓవైపు రాజకీయంగా ఇంత రచ్చ జరుగుతున్నా… ఏది నిజమో చెప్పాల్సిన అధికారులు మాత్రం కామ్‌గా ఉన్నారు. వాళ్ళు వెంటనే నోరు విప్పి ఎవరి వాదన వాస్తవమో తేల్చేసి ఈ పొలిటికల్‌ కంపును కడిగేయాలంటున్నారు స్థానికులు. ఈ రాజకీయం రివెంజ్‌ల దాకా వెళ్ళక ముందే జోక్యం చేసుకుని ఎండ్‌ కార్డ్‌ వేయాలంటున్నారు.