Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record B Tech Ravi Vs Ramgopal Reddy

Off The Record : పులివెందుల టీడీపీలో ఆధిపత్య పోరు

Published Date :April 9, 2025 , 9:54 pm
By Gogikar Sai Krishna
Off The Record : పులివెందుల టీడీపీలో ఆధిపత్య పోరు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కడ ప్రత్యర్థులతో పని లేకుండా టీడీపీలోని రెండు వర్గాలే గుద్దులాటకు దిగుతున్నాయా? సాక్షాత్తు ఇన్ఛార్జ్‌ మంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వ్యవహారం వెళ్ళిందా? పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గంలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందా? ఏదా సెగ్మెంట్‌? ఎవరా ఇద్దరు? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెట్టని కోట పులివెందుల. గడిచిన 45 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానిదే ఇక్కడ హవా. అలాంటి కోటను ఎందుకు బద్దలు కొట్టకూడదు? పసుపు జెండా ఎందుకు ఎగరేయకూడదన్నది టీడీపీ పెద్దల టార్గెట్‌. ఆ లక్ష్యంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ పులివెందుల నినాదం తెర మీదికి వచ్చింది. కానీ… గ్రౌండ్‌ రియాలిటీ చూస్తుంటే మాత్రం మాకా నమ్మకం కలగడం లేదని కేడరే చెప్పుకుంటున్న పరిస్థితి. పై స్థాయిలో వాళ్ళయితే కలలు గంటున్నారు గానీ… నియోజకవర్గంలో పని చేయాల్సిన వాళ్ళు ఆ దిశగా అడుగులేస్తున్నారో లేదో వాళ్ళ అంతరాత్మలనే అడగమనండని అంటున్నారు పులివెందుల టీడీపీ కార్యకర్తలు. స్థానిక వైసీపీ అసంతృప్తులను కలుపుకుని, పార్టీ కేడర్‌కు భరోసా ఇస్తూ… ముందుకు నడిపించాల్సి నాయకులు ఇద్దరూ తన్నులాటలకు సై అనడం ఇక్కడి ద్వితీయ శ్రేణిని కలచివేస్తోందట. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మధ్య పెరుగుతున్న గొడవలు పార్టీ పరువును పులివెందుల నడివీధుల్లో నిలబెడుతున్నాయని అంటున్నారు.పార్టీ తీరు ఒకలా ఉంటే… వాళ్ళిద్దరి తీరు మాత్రం మరోలా ఉందని, అసలు ఇద్దరికీ వై నాట్‌ పులివెందుల నినాదం నచ్చిందో లేదోనని కూడా వెటకారాలాడుతున్నారట టీడీపీ కార్యకర్తలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పై దృష్టి సారించాల్సిన నేతలు ఇద్దరూ… ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు తప్ప అసలు విషయం మీద దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.

పరస్పరం అణిచివేతకు కుట్రలు పన్నడంతోనే టైంపాస్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వీళ్ళ గొడవలతో పార్టీ పటిష్టం సంగతి తర్వాత… అసలు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ పుడుతోందని అంటున్నారు. గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మీద పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. అప్పటినుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారాయన. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీ పవర్‌లోకి వచ్చాక మేం చెప్పిందే నడవాలన్నట్టుగా ఇద్దరూ వ్యవహరించడంతో సమస్య పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. నేను నియోజకవర్గ ఇన్చార్జిని. నా మాటే చెల్లాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పట్టుపట్టుతుండగా, నేను ఎమ్మెల్సీని, నాకు ప్రోటోకాల్‌ ఉంది కాబట్టి నా మాటే చెల్లాలంటున్నారట రాంగోపాల్ రెడ్డి. అలా… ఇద్దరి మధ్య పెరుగుతన్న ఆధిపత్య పోరు ఇటు అధికారులకు, అటు టిడిపి క్యాడర్‌కు తలనొప్పిగా మారుతోందట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మొట్ట మొదటిసారి పార్టీ పులివెందుల నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఆ మీటింగ్‌లో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వేదికపైకి ఎక్కగానే… మాజీ ఎమ్మెల్సీ వర్గం ఆగ్రహంతో ఊగిపోయిందట. సాక్షాత్తు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత వారిస్తున్నా… కంట్రోల్‌ కాలేదట బీటెక్‌ రవి అనుచరులు. దీంతో నిన్న మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు, రోడ్డెక్కినట్టయిందంటున్నారు పరిశీలకులు. వైసిపి అధినేత అడ్డాలో పార్టీకి ఊతమివ్వాల్సిన టిడిపి నేతలే ఇలా వీధికెక్కి పరువు మంటగలుపుతున్నారన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది పార్టీ కేడర్‌లో. రెండు వర్గాలు సై అంటే సై అనడంతో టెన్షన్‌ వాతావరణం ఏర్పడుతోందట నియోజకవర్గ పార్టీలో. పార్టీ పెద్దలు తక్షణం జోక్యం చేసుకుని సరిదిద్దకుంటే… వై నాట్‌ పులివెందుల నినాదం సంగతి తర్వాత… మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు కార్యకర్తలు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • B Tech Ravi vs Ramgopal Reddy
  • ntv
  • OTR

తాజావార్తలు

  • Helicopter Crash: ఇండోనేషియాలో కూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి

  • Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్‌, నో వికెట్.. ఇక కష్టమేనా!

  • UN-India: హార్ముజ్‌ను దిగ్బంధించడం భావ్యం కాదు.. ఐరాస‌లో భారత్ ఖండన

  • Terror Module: రైళ్లను పేల్చేందుకు కుట్ర.. హిందూ నాయకులే టార్గెట్.. భారీ ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు

  • MP Mithun Reddy: ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు.. కానీ, చట్టంలో లేదని ఇవ్వలేదు.. విపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్‌ను వాడొద్దు..

ట్రెండింగ్‌

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions