NTV Telugu Site icon

Off The Record: తోట త్రిమూర్తులు కాపులకు పెద్ద దిక్కుగా మారాలనుకుంటున్నారా..?

Thota Trimurthulu

Thota Trimurthulu

Off The Record: తోట త్రిమూర్తులు, వైసీపీ ఎమ్మెల్సీ.. గతంలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారాయన. అప్పటి పరిణామాలను బట్టి వేర్వేరు పార్టీల తరపున ప్రాతినిధ్యం వహించారు. అయితే… గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మండపేట నుంచి తొలిసారి బరిలో దిగి ఓడిపోయారు త్రిమూర్తులు. అయితే ఇప్పుడాయన లెక్కలు పూర్తిగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. మొదట్నుంచి రాజకీయం కంటే తనకు కులమే ముఖ్యమని చెప్పే తోట త్రిమూర్తులు… ఇక నుంచి ఆ వాయిస్‌ను ఇంకా గట్టిగా వినిపించాలనుకుంటున్నారట. ఆ మాటకొస్తే.. ఎవరేమనుకున్నాసరే.. తన బలమే కులమని చెప్పాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. తాజాగా కాపు వన సమారాధన కార్యక్రమంలో తోట చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

Read Also: WhatsApp Update: చాట్ లిస్ట్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న వాట్సాప్

కాపుల్లో ఐక్యత లేదని, ఎదిగే కాపుల్ని ఎవరూ వెనక్కి లాగ వద్దని చెబుతూనే.. మనల్ని ఎవరూ పైకి తీసుకురారు… మనకు మనమే ఎదగాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారాయన. అంతవరకు బాగానే ఉంది. కుల పరంగా ఓ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ మాత్రం చెప్పుకోకుండా ఎలా ఉంటారని అనుకోవచ్చు. కానీ.. దీనికి కొనసాగింపుగా తోట త్రిమూర్తులు చేసిన వ్యాఖ్యలే ఇటు కాపు సామాజికవర్గంలోను, అటు పొలిటికల్‌ సర్కిల్స్‌లోను చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక రెడ్డిగారు కారు కొంటే.. మంచి కారు కొన్నారని అంటారని, ఒక చౌదరి గారు ఇల్లు కడితే మంచి బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారని, అదే… ఒక కాపు స్కూటర్ మీద వెళ్తుంటే ఎక్కడో కొట్టుకు వచ్చాడని మనవాళ్ళే అంటారు… ఈ పద్ధతి మారాలి, మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని అన్నారట ఎమ్మెల్సీ. అలా ఆలోచించడం వల్లే మనం ఎదగలేకపోతున్నామని, దానికి చెక్ పెట్టాలని సూచించారట త్రిమూర్తులు. ఈ స్టేట్‌మెంట్స్‌పైనే ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోందట. త్రిమూర్తులు… పార్టీగా వైసీపీ స్టాండ్ కంటే, కమ్యూనిటీ స్టాండ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అనే వాళ్ళు కొందరైతే.. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి విన్యాసాలు తప్పవని గుసగుసలాడుకునే వాళ్ళు మరికొందరట.

Read Also: WhatsApp Update: చాట్ లిస్ట్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న వాట్సాప్

అయినా… ఇప్పుడేం ఎన్నికలు లేవు. అలాంటప్పుడు ఆయన కులం గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే… ఇక ఈ అంశం మీద ఫోకస్‌ చేసి కులానికి పెద్ద దిక్కుగా మారాలనుకుంటున్నారా అని ప్రశ్నించేవాళ్ళు సైతం ఉన్నారు. అదే సమయంలో భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఆయన ఇప్పట్నుంచే సేఫ్‌ గేమ్‌ మొదలుపెట్టారా అన్న డౌట్స్‌ కూడా వస్తున్నాయట. ప్రస్తుతానికి పార్టీ మారే అవకాశం ఆలోచనలో లేరు త్రిమూర్తులు. కానీ… ముందు మందు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గనుక… అవసరాన్ని బట్టి తగిన నిర్ణయం తీసుకోవడానికి ఈ విధంగా క్యాస్ట్‌ ఈక్వేషన్స్ ప్లే చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోందట తూర్పుగోదావరిలో. అధిష్టానం ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా… జనసేన మీద కాపు ముద్ర బలంగా ఉంది. ఇక 2029 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అందుకే.. ఇప్పటినుంచే ఏ పార్టీలో ఉన్నా.. తనకంటూ ఒక హైప్ క్రియేట్ చేసుకునే పనిలో భాగంగానే త్రిమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. అందుకే వైసీపీలో ఉంటూనే… పార్టీ సంగతి తర్వాత… ముందు వ్యక్తిగతంగా మనం బలపడాలన్న లెక్కలతోనే ముందుకు వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎదిగే కాపులను వెనక్కి లాగవద్దన్న మాటలు కూడా అందులో భాగమే అయి ఉండవచ్చంటున్నారు.

Read Also: Bhatti Vikramarka : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగింది

పార్టీలపరంగా ఎవరి లెక్కలు వారికుంటాయి గానీ… కులం కోణంలో మాత్రం తానే ఓ అడుగు ముందుకు వేయాలన్న ఆలోచనతోనే అడ్వాన్స్‌ అయి ఉంటారన్న అభిప్రాయం సైతం ఉంది. అందుకే ఎక్కడా తేడా రాకుండా… సేఫ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసి ఉండవచ్చంటున్నారు. మొత్తానికి తోట త్రిమూర్తులు పార్టీ కంటే కమ్యూనిటీ పరంగా తనను తాను హైప్ చేసుకునే పనిలో పడ్డారన్నది విస్తృతాభిప్రాయం. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్న అలా కానిచ్చేస్తున్నారట. పార్టీలు, ఎన్నికల సంగతి తర్వాత చూద్దాం… ముందు మనకు కుల బలమే ముఖ్యం. అది ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ వాటంతటవే దగ్గరికి వచ్చేస్తాయన్నది ఆయన ఆలోచన అట.తోట వారి లెక్కలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.

Show comments