Off The Record: రాప్తాడు సిద్ధం సభతో ఉలిక్కిపడ్డ టీడీపీ..! వార్నింగ్ బెల్‌గా మారిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: టీడీపీలో ఇప్పుడు వైసీపీ సిద్ధం సభల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. భీమిలిలో జరిగిన తొలి సభను లైట్‌గానే తీసుకుంది తెలుగుదేశం. ఆ తర్వాత దెందులూరులో జరిగిన రెండో మీటింగ్‌ను చూసి.. ఏముందబ్బా…. సభ చప్పగానే ఉందని భావించారట టీడీపీ నేతలు. కానీ రాప్తాడు సభతో ఒక్కసారిగా ఉలిక్కి పడిందట ఆ పార్టీ. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు.. ఆ సభకు వచ్చిన జనంలో రెస్పాన్స్ షాకింగ్‌గానే ఉందన్న చర్చ టీడీపీలో జరుగుతోందట. రాయలసీమలో కూడా టీడీపీ చాలా వరకు బలపడిందని.. వైసీపీ కడప లాంటి జిల్లాల్లో కూడా బలహీన పడిందనే భావనలో ఇన్నాళ్లూ ఉన్నారు సైకిల్ పార్టీ నేతలు. కానీ రాప్తాడు సిద్ధం సభతో ఓ విధంగా టీడీపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఎన్నికలకు ముందు సీఎం జగన్ సభలకు ఈ స్థాయిలో జనం రావడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశమనేది టీడీపీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు నిర్వహిస్తున్న రా.. కదలి రా.. సభలకు కూడా జనం బాగానే వస్తున్నారని ఇన్నాళ్లూ సంబర పడుతోంది తెలుగుదేశం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న రా కదలి రా సభలకు రెస్పాన్స్ బాగుందనే సంతోషంగా ఉన్న టీడీపీ శ్రేణులకు రాప్తాడు సిద్దం సభ షాక్ ఇచ్చినట్టుగా ఉందట.
ఈ క్రమంలో వైసీపీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వైసీపీని టార్గెట్ చేసుకునే సందర్భాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయట టీడీపీ శ్రేణులు. వైసీపీ ఓ పక్కన అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసి.. సిద్దం సభలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఇంకా అభ్యర్థుల ఖరారు విషయంలో వెనకబడినట్టే కన్పిస్తోంది. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకున్నా.. చంద్రబాబు లోలోపలే వ్యవహారాన్ని చక్కబెడుతున్నా.. క్షేత్ర స్థాయిలో గందరగోళం మాత్రం పార్టీ కేడర్‌ని ఇబ్బంది పెడుతూనే ఉందట. ఇప్పటికీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ రాకపోవడం.. అటు జనసేనతో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదనే ప్రచారంతో కేడర్‌లో విపరీతమైన నిరాశ నిస్పృహలు పెరుగుతున్నాయన్న ఫీడ్ బ్యాక్ పార్టీ కార్యాలయానికి వస్తోందట. అయినా అధినాయకత్వం ఏం చేయలేని పరిస్థితి. బీజేపీతో పొత్తుల వ్యవహరం కొలిక్కి రాకపోవడంతో ఏం జరగబోతోందనే విషయం అర్థంగాక టీడీపీ కేడరులో ఆందోళన వ్యక్తమవుతోందంటున్నారు.
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
మరోవైపు బీజేపీతో పొత్తు వల్ల నష్టమే తప్ప.. లాభం లేదనే చర్చ పార్టీలోని లీడర్లను కుదేలయ్యేలా చేస్తోంది. ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 60కు పైగా ఉంటాయని.. వాటిల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో టీడీపీ మీదున్న పాజిటివ్ ఇంపాక్ట్ నెమ్మదిగా తగ్గుతోందన్న అభిప్రాయం ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో సిద్దం లాంటి సభలతో వైసీపీ దూసుకెళ్లే ప్రయత్నం చేయడం.. దానికి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో రాజకీయం ఎటు వైపు మళ్లుతుందో అర్థం కాని పరిస్థితి ఎక్కువ మంది టీడీపీ నేతల్ని కంగారు పెడుతోందట. ఈ క్రమంలో వీలైనంత త్వరగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, లేదంటే ఘోరంగా దెబ్బతింటామన్న సూచనలు తెలుగుదేశం హై కమాండ్‌కు అందుతున్నాయట. పాజిటివ్ వైబ్స్ వస్తున్న టైంలో నాన్చుడు ధోరణితో నిర్ణయాలు తీసుకోలేకపోతే మూల్యం గట్టిగానే చెల్లించుకోవాల్సి వస్తుందన్న వార్నింగ్‌లను పార్టీ పెద్దలు ఏ మేరకు చెవికెక్కించుకుంటారో చూడాలంటున్నారు టీడీపీ నాయకులు.
తాజావార్తలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!