Off The Record: సిట్టింగ్ ఎంపీకి ఈసారి టికెట్ డౌటేనా? వైసీపీ పరిశీలిస్తున్న పేర్లేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సీనియర్ పొలిటీషియన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస వివాదాలు ఆయన్ని వెంబడిస్తున్నాయి. దాదాపు పాతికేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న మాగుంటకు వివాదాల జోలికి పోడన్న పేరుంది. కానీ… ఈ దఫా ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డితో రాజకీయ అరంగ్రేటం చేయించాలని చేస్తున్న ప్రయత్నాలకు పురిట్లోనే సంధికొడుతోందట. గతంలో తన తండ్రి అందుబాటులో లేని సమయంలో రాఘవరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. దానిపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు నేరుగా ఎంపీకే చెప్పేశారట. దీంతో ఆయనను వ్యాపారాలకే పరిమితం చేశారు శ్రీనివాసరెడ్డి. అలా వ్యాపార వ్యవహారాలు చూసుకునే క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారు రాఘవరెడ్డి.
తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి మరణం తర్వాత 1998లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు శ్రీనివాసులరెడ్డి. 1998, 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019లో వైసీపీ తరఫున మొత్తం నాలుగు సార్లు ఎంపీ అయ్యారాయన. 2014లో టీడీపీలో చేరిన మాగుంట ఎంపీగా ఓడారు. తర్వాత ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తన వర్గాన్ని ఏర్పరచుకుని తాను ఏ పార్టీలో ఉన్నా వారిని కాపాడుకుంటు వస్తున్నారు మాగుంట. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరగడం, తాను మారటం లేదని వివరణ ఇవ్వడం ఇటీవల పరిపాటి అయింది. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని వైసీపీ తరపున ఒంగోలు లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయించాలని పావులు కదుపుతుండగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టవడం పెద్ద దెబ్బేనని అంటున్నారు. నేరాన్ని అంగీకరిస్తే రాఘవరెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలున్నా. చేయని తప్పును ఒప్పుకుంటే…తర్వాత రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, అందుకే బెయిల్ వచ్చేదాకా రాఘవ జైల్‌లోనే ఉంటారని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట శ్రీనివాసుల రెడ్డి.
Also Read
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
- Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
అయితే అదే సమయంలో వైసీపీ అధిష్టానం ఆలోచన మరోలా ఉన్నట్టు తెలిసింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఓకే… ఎక్కడన్నా తేడాకొట్టి ఎన్నికల నాటికి మాగుంట కుటుంబం పోటీ చేయలేని పరిస్థితి వస్తే… ఏంటన్నది అధినాయకత్వపు ఆలోచనగా చెబుతున్నారు. అందుకే మాగుంటకు ప్రత్యామ్నాయాన్ని వెదికే పనిలో ఉన్నట్టు సమాచారం. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ పోటీకి సుముఖంగా ఉన్నా… ఆయన సొంత బావమరిది, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో విభేదాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వాటి ప్రభావం పార్టీ మీద పడి ఎన్నికల్లో నష్టం కలగవచ్చన్న అభిప్రాయం నాయకత్వానికి ఉంది. అందుకే సుబ్బారెడ్డి అభ్యర్థిత్వంపై అధిష్టానం అంత సుముఖంగా లేనట్టు తెలిసింది. ఒకవేళ కాదు కూడదని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి వైవీని పోటీలో దింపినా…తర్వాత మనసులు కలవకుంటే…ఇబ్బంది లేని చోట టఫ్ ఫైట్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దలకు ఉందట. ఒంగోలు లోక్‌సభ సీటుకు ప్రత్యర్థుల నుంచి చెప్పుకోతగ్గ అభ్యర్థులు లేనందున ఇప్పటికిప్పుడు టెన్షన్ పడి ఎవరో ఒకరి పేరు చెప్పాల్సిన అవసరం లేదన్నది వైసీపీ అధినాయకత్వపు ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు మాగుంట కూడా సీఎం జగన్‌కు అన్ని విషయాలు చెప్పామని, కాంట్ బట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు చూద్దామనుకుంటున్నట్టు తెలిసింది. పైకి గంభీరంగా చెబుతున్నా… లోలోపల మాత్రం ఆ రోజుకు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాగుంటలో ఉందన్నది సన్నిహితుల మాట. పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయం చూసుకుంటుందా? లేక టెన్షన్ లేకుండా సిట్టింగే మళ్ళీ బరిలో దిగుతారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!