Site icon NTV Telugu

Off The Record: తెలంగాణలో మరో కొత్త పొలిటికల్ పార్టీ..?

Mla Raja Singh

Mla Raja Singh

Off The Record: ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యవహారశైలి కొద్ది కాలంగా… తెలంగాణ బీజేపీకి మింగుడుపడనట్టుగానే ఉంటోంది. పార్టీ నేతల మీద తిట్ల దండకాలు, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి మీద మిమర్శల్లాంటివి బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం. అయితే…. ఆయన డైరెక్ట్‌గా విమర్శిస్తున్నా, సోషల్‌ మీడియా మెసేజ్‌లు పెడుతున్నా… కమలం నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. ఎవరైనా అడిగితే కూడా….అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అంటూ దాటేస్తున్నారు. అదే సమయంలో అటు రాజాసింగ్‌ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అంతకు మించి ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి వాడుతున్న భాష తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. సమయం, సందర్భం లేకుండా గోషామహల్‌ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఇటు పార్టీ కేడర్‌లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందట. ఈ క్రమంలో రాజాసింగ్‌ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Read Also: CM Chandrababu: పొదిలిలో వైసీపీ రాళ్ల దాడిపై సీఎం సీరియస్‌.. డీజీపీకి కీలక ఆదేశాలు..

కానీ… బీజేపీ అధినాయకత్వం వైపు నుంచి మాత్రం ఎప్పటికప్పుడు అలాంటివేం ఉందవన్న మాటలే వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే మాత్రం తగ్గేదేలే అంటున్నారు. నాకు నోటీసులు ఇవ్వడం కాదు.. దమ్ముంటే సస్పెండ్ చేసుకోండంటూ సవాల్‌ విసురుతున్నారు. మేటర్‌ అంతదాకా వస్తే… చాలామంది బండారం బయటపెట్టి మరీ…. నేను బయటికి పోతానంటున్నారాయన. ఆ పరిస్థితి వస్తే… ఎవరెవరి గురించి మాట్లాడతారన్న సంగతి పక్కనబెడితే… ఆయన మాటల్ని చూస్తుంటే…. బీజేపీని వదిలేయడానికి మానసికంగా సిద్ధమైనట్టు కనిపిస్తోందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. నిజంగానే… అదే జరిగితే…. ఇప్పటికిప్పుడు రాజాసింగ్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటన్నది బిగ్‌ క్వశ్చన్‌. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఆయన్ని తీసుకునే అవకాశం ఎంతమాత్రం లేదు. సొంత పార్టీ పెడతారా అంటే… రాజకీయంగా ఆ స్థాయిగాని, అంత ఆర్థిక వనరులుగాని రాజాసింగ్‌ దగ్గర లేవన్నది ఎక్కువ మంది అభిప్రాయం.

Read Also: CM Chandrababu: పొదిలిలో వైసీపీ రాళ్ల దాడిపై సీఎం సీరియస్‌.. డీజీపీకి కీలక ఆదేశాలు..

ఈ క్రమంలోనే… కొత్త డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు. మహారాష్ట్ర పార్టీని తెలంగాణలో దింపుతారా అన్న డౌట్స్‌ వస్తున్నాయట.
రాజాసింగ్‌…. శివసేనకు జై కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే భావజాలానికి ఆ పార్టీ సిద్ధాంతాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి అటువైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే… అందులో ఏ శివసేనను అన్న విషయంలో మాత్రం ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. షిండే సేనను తీసుకొస్తారా? లేక థాక్రే అక్కున చేర్చుకుంటారా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద గోషామహల్‌ ఎమ్మెల్యే అడుగులు మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్‌.

Exit mobile version