NTV Telugu Site icon

Off The Record: మాజీ ఎమ్మెల్యే వైఖరిపై కాకినాడలో చర్చ..

Dwarampudi

Dwarampudi

Off The Record: ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. కాకినాడ మాజీ ఎమ్మెల్యే.. ఒకప్పుడు నియోజకవర్గంలోనే కాదు.. జిల్లాలోనే నా అంతటి వాడు లేడంటూ విచ్చలవిడిగా చెలరేగిపోయిన లీడర్‌. ఇంకా చెప్పాలంటే కాకినాడ సిటీలో నేనే రాజు, నేనే మంత్రి అన్నంతగా విర్రవీగిపోయాడట మాజీ ఎమ్మెల్యే. కానీ.. కాలం మారింది. ఓటర్లు ఒక్క పెట్టున ఈడ్చికొట్టిన దెబ్బకు మనోడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడమే కాదు.. ఇన్నేళ్ళు లేనిది బర్త్‌ డే వేడుకల్ని సైతం నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్‌లో.. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యనే జరుపుకున్నారట. ఇదే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది కాకినాడ. ముందూ వెనకా చూసుకోకపోతే అలాగే ఉంటుందిరా అబ్బాయ్‌… అంటూ… గోదావరి స్టైల్‌ సెటైర్స్‌ కూడా గట్టిగానే పడుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు గెలిచారాయన. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి 56వేల 572 ఓట్ల భారీ తేడాతో టిడిపి అభ్యర్థి కొండబాబు చేతిలో ఓడిపోయారు చంద్రశేఖర్ రెడ్డి.

Read Also: Crime: భార్యను గొంతు నులిమి..తలను శరీరం నుంచి వేరు చేసి..దారుణ హత్య

ఎన్నికల్లో పోటీ అన్నాక గెలుపు ఓటములు సహజమే అయినా… ఈ స్థాయి ఓటమిని మాత్రం అస్సలు ఊహించలేదట ద్వారంపూడి. కాకినాడలో గత నాలుగు ఎన్నికల్ని పరిశీలిస్తే… ఎవరు గెలిచినా మెజార్టీ పాతిక వేలలోపే. కానీ.. ఈసారి అంతకు రెట్టింపు అవడంపైనే చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఆ మెజార్టీ చూసినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే కూడా తెగ మధనపడిపోతున్నారన్నది పార్టీ వర్గాల టాక్‌. గెలుస్తామని అనుకున్నాం.. సరే పోనీ ఓడిపోయాం. అందులోనూ ఇంత ఘోరంగానా అంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదట. ఈ క్రమంలోనే తాజాగా ఆయన బర్త్‌ డే వేడుకల ప్రస్తావన వస్తోంది సెగ్మెంట్‌లో. జులై 8న వైఎస్సార్‌ జయంతి రోజునే.. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పుట్టినరోజు కావడంతో ఏటా ఆ రోజున గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేవారాయన.

Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో అంతర్మథనం.. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని భావిస్తోందా..?

కానీ, ఫస్ట్‌ టైం ఈసారి ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్‌లో సింపుల్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు ద్వారంపూడి. ఆయన అనుచరుల మధ్య కూడా ఇప్పుడు అదే చర్చ అట. ఎప్పుడూ లేనిది ఇలా ఔటాఫ్‌ స్టేషన్‌ ఎందుకు వెళ్ళారంటూ తెగ గుసగుసలాడుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పుడప్పుడే జనాల్లోకి రావడం ఇష్టం లేదా? లేక వస్తే… వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయట కాకినాడలో. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌, ద్వారంపూడి మధ్య డైలాగ్ వార్ నడిచింది. దమ్ముంటే పవన్ నాపై పోటీ చేయాలంటూ అప్పట్లో సవాల్ చేశారు ద్వారంపూడి. ఇక్క రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాలతో ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించారంటూ మాజీ ఎమ్మెల్యే మీద పోలీస్‌ కేసు బుక్‌ అయింది. మరోవైపు ఆయన అక్రమ వ్యాపారాలపై దాడులు కొనసాగుతున్నాయి. ద్వారంపూడి కనుసన్ననల్లోనే రేషన్‌ బియ్యం మాఫియా నడుస్తోందని స్వయంగా మంత్రే కామెంట్‌ చేసిన పరిస్థితి. దాదాపు 35 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇప్పటిదాకా సీజ్ చేశారు అధికారులు. వాటి విలువ 100 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఆ సరుకంతా మాజీ ఎమ్మెవల్యేదేనన్న ప్రచారం ఉంది.

Read Also: Dubai: దుబాయ్‌లో దారుణం.. భారతీయుడ్ని చంపిన పాకిస్థానీయులు

మరోవైపు చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు నిర్వహిస్తున్న వీరభద్ర రొయ్యల కంపెనీకి నోటీస్‌లు ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఈ క్రమంలో… అసలు ఆ రోజున పవన్ పై అవసరం లేని విమర్శలు ఆ స్థాయిలో చేయడమే ఇంతటి ఓటమికి కారణమన్న చర్చ జరుగుతోందట ద్వారంపూడి శిబిరంలో. సబ్జెక్ట్ పరంగా విమర్శించాలి తప్ప అనవసరంగా టంగ్ స్లిప్ అవడం వల్ల ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకున్నామని, అంతా అయ్యాక ఇప్పుడు వగస్తే ఉపయోగం ఏంటంటూ ఆయన మనుషులే మాట్లాడుకుంటున్నారన్నది లోకల్‌ వాయిస్‌. జిల్లాలో వైసీపీ నేతలు అందరూ ఓడిపోయారు… తిరిగి ఎవరి కార్యక్రమాలలో వారు ఉన్నారు. ఈయనకు మాత్రమే ఈ ప్రత్యేక పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఒక్కసారి ఆలోచించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చేవారు సైతం బయలు దేరారట. మొత్తానికి… పరిస్థితిని చూస్తుంటే… మనోడు ఇప్పుడప్పుడే ట్రాక్‌ ఎక్కే సూచనలు కనిపించడం లేదని అనుకుంటున్నారట ద్వారంపూడి అనుచరులు. ఈ అజ్ఞాత వాసం ఎన్నాళ్లో చూడాలన్నది వాళ్ళ మాట.