NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో మళ్లీ టికెట్ దక్కేది ఎవరికి?

Kcr

Kcr

Off The Record: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కేసీఅర్. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ … ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈసారి సిట్టింగ్‌లలో టిక్కెట్‌లు దక్కేది ఎవరికి? నో చెప్పేది ఎవరికన్న చర్చ మొదలైంది. దీనికి తోడు గురువారం హైదరాబాద్‌లో జరిగిన BRS రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్‌ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యేల్లో సెగలు రేపుతున్నాయట. ఒక వైపు ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి … అసంతృప్త గళాలు పెరగడానికి… ఇప్పుడు కేసీఅర్ మాటలు తోడవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఎమ్మెల్యేలు.

శాసనసభ్యులు నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రతినిధుల సమావేశంలో సూచించారు కేసీఅర్. గతంలో చెప్పినట్టుగానే సిట్టింగ్‌లకే టికెట్లని ఈసారి కూడా అన్నారట. కానీ ఈ సారి ఒక అడుగు ముందుకేసి ప్రజల్లో ఆదరణ లేకపోతే తాను కూడా ఏం చేయలేనని వార్నింగ్ ఇచ్చారు. టికెట్ల పంచాయితీ ఎందుకు అని , ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసునని తేల్చేశారట కేసీఆర్‌. ఇప్పుడు సిట్టింగ్‌లలో టెన్షన్‌ అందుకేనట. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటున్న సీఎం ఈసారి 100 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకే టిక్కెట్స్‌ విషయంలో అస్సలు మొహమాటాలు లేకుండా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణల విషయంలో కూడా సీరియస్‌గానే స్పందించినట్టు చెబుతున్నారు. పనితీరు మార్చుకోకుంటే.. మిమ్మల్ని నేనే మార్చాల్సి వస్తుందని నేరుగానే చెప్పేశారట. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల పరంగా కేసీఅర్ పెట్టిన ఫిట్టింగ్ తో ఎవరి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెరుగుతోందట బీఆర్‌ఎస్‌లో.