Site icon NTV Telugu

Cunning Friend : ఫ్రెండ్ అని నమ్మితే.. పెళ్లికి పనికి రాకుండా చేశాడు

Friend

Friend

Cunning Friend : ప్రతి ఒక్కరి జీవితంలో ఓ బెస్ట్ ఫ్రెండ్ తప్పని సరిగా ఉంటారు. స్నేహం చాలా ముఖ్యం. సన్నిహిత మిత్రులతో ప్రతిదీ పంచుకుంటాము. అతడు కనిపించకుంటే చాలా బాధపడతాము. అలాంటి స్నేహితుడు మోసం చేస్తే అసలు తట్టుకోలేము. అలా చేస్తే స్నేహం పట్ల విశ్వాసం కచ్చితంగా పోతుంది. అటువంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది.

Read Also: Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం

ఒడిశాలోని కేంద్రపాడ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన బెస్ట్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ ను కోసేశాడు. తర్వాత ఆ యువకుడు తన స్నేహితుడిని అక్కడే వదిలి పారిపోయాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొలిపింది. ఇది రాజ్‌నగర్‌లో జరిగింది. ఈ సంఘటన తర్వాత తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రిలో చేర్చారు.

Read Also: Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు

భగవత్ దాస్ అతని స్నేహితుడు అక్షయ్ ఆదివారం సెలవు రోజున పెంటా వద్ద బీచ్‌కి వాకింగ్ కి వెళ్లారు. ఇద్దరూ బీచ్‌లో చాలా సేపు గడిపారు. ఆ తర్వాత భోజనం చేసి అక్కడే పడుకున్నారు. భగవత్ నిద్రపోతున్నప్పుడు అక్షయ్ అతని ప్రైవేట్ భాగాన్ని పదునైన ఆయుధంతో కోశాడు. ఆ తర్వాత భగవత్‌ తీవ్ర గాయాల పాలయ్యాడు.. అనంతరం అక్షయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన భగవత్ తన బంధువులకు సమాచారం అందించాడు. అతని బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా భగవత్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని శరీరం నుంచి రక్తం కారుతోంది. అతడిని బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, భగవత్ మామ అక్షయ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్షయ్ కోసం వెతుకుతున్నారు. అయితే అక్షయ్ ఎందుకు ఇలా చేశాడో ఇంకా అర్థం కాలేదు.

Exit mobile version