Site icon NTV Telugu

Odisha Train Tragedy: బాలాసోర్ రైలు ప్రమాదం.. మరో 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత

Odisha Train Accident

Odisha Train Accident

Odisha Train Tragedy: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను శనివారం వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఉంచారు. డీఎన్‌ఏ పరీక్షల సహాయంతో 29 మృతదేహాలను గుర్తించగా, శుక్రవారం ఆరు, శనివారం 13 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు రైల్వే అధికారి తెలిపారు.

Read Also:Twitter: రోజుకు 600ట్వీట్లు మాత్రమే చదవగలరు.. ఎలాన్ మస్క్ కొత్త రూల్

DNA పరీక్ష ఫలితాల ఆధారంగా AIIMS భువనేశ్వర్, భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (BMC), ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) మధ్య సమన్వయం ద్వారా, బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను అందజేశామని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం వారి బంధువులకు అప్పగించామన్నారు. ఈ 13 మృతదేహాలలో నాలుగు మృతదేహాలను బీహార్‌కు, ఎనిమిది మృతదేహాలను పశ్చిమ బెంగాల్‌కు, ఒక మృతదేహాన్ని జార్ఖండ్‌కు పంపినట్లు అధికారి తెలిపారు.

Read Also:Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..

ఇంకా గుర్తించని 62 మృతదేహాలు
రైల్వేశాఖ ప్రకటన ప్రకారం మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు తెలిపారు. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఉంచిన 62 మృతదేహాలను ఇంకా గుర్తించలేదని అధికారి తెలిపారు. భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మిగిలిన మృతదేహాలను గుర్తించడానికి వారి బంధువుల కోసం వెతుకుతున్న వ్యక్తుల DNA నమూనాలను తీసుకుంటోంది. వారి మ్యాచింగ్ ప్రకారం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు.

Exit mobile version