NTV Telugu Site icon

Christmas 2022: 1500 కేజీల టమాటాలతో భారీ శాంతాక్లాజ్ సైకత శిల్పం

Christamas

Christamas

Christmas 2022: ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శనివారం 2022 క్రిస్మస్ సందర్భంగా ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్ బీచ్‌లో శాంతా క్లాజ్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఇసుక కళతో పట్నాయక్ “మెర్రీ క్రిస్మస్” అని రాశారు. పట్నాయక్ 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు కలిగిన శాంతాక్లాజ్‌ను 1500 కిలోల టొమాటోలను ఉపయోగించి రూపొందించారు. శనివారం రాత్రి దీన్ని ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. ఇసుక, టమాటాలతో 27 అడుగుల ఎత్తున దీనిని తీర్చిదిద్దామని, 15 మంది శిష్యులు సహకరించారని సుదర్శన్‌ పట్నాయక్‌ వివరించారు. దీనిని గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపుతున్నట్లు చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ను చాలా వైభవంగా జరుపుకుంటారు. ప్రజలు డ్యాన్స్ చేస్తూ, కొత్త దుస్తులు ధరించి, తమ ప్రియమైన వారికి హృదయపూర్వక బహుమతులు ఇస్తూ రోజంతా గడుపుతారు. గతంలో 2021 క్రిస్మస్ సందర్భంగా, పట్నాయక్ 5400 ఎర్ర గులాబీలు, ఇతర పువ్వుల సహాయంతో పూరీ సముద్ర తీరంలో శాంతాక్లాజ్ యొక్క 50 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పు గల ఇసుక శిల్పాన్ని రూపొందించారు.

Jammu Kashmir: పాకిస్తాన్ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

గత 17 ఏళ్లుగా క్రిస్మస్ సందర్భంగా ఇసుక కళతో శిల్పాలను రూపొందిస్తున్నాడు. అతని అనేక ఇసుక శిల్పాలు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాయి. పద్మభూషణ్ అవార్డు గెలుచుకున్న ఇసుక కళాకారుడు సుదర్శన్ ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా అంతర్జాతీయ ఇసుక కళల ఛాంపియన్‌షిప్‌లు, ఉత్సవాల్లో పాల్గొని అనేక అవార్డులను గెలుచుకున్నారు