NTV Telugu Site icon

ODI World Cup 2023 Tickets Price: అభిమానులకు గుడ్‌న్యూస్.. ప్రపంచకప్ 2023 టికెట్ల ధరలు ఇవే!

Eden Gardens

Eden Gardens

CAB announced Ticket Prices of Eden Gardens for ICC ODI World Cup 2023: భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023​​ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవలే రిలీజ్ చేసింది. ఆక్టోబర్‌ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఆక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ తలపడనుంది. ఆపై క్రికెట్‌ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న దాయాదుల సమరం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగనుంది.

వన్డే ప్రపంచకప్‌ 2023 భారత్‌లోని పది వేదికల్లో జరగనుంది. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ కూడా ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో 5 లీగ్‌ మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్‌ 2 కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) వెల్లడించింది. ఈడెన్ మైదానంలో జరిగే అన్ని మ్యాచ్‌ల ధరలు రూ. 650 నుంచి రూ. 3000 వరకు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ టిక్కెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

# Bangladesh vs Netherlands Match Ticket Price:
Upper Tiers: INR 650
D H blocks: INR 1000
B C K L blocks: INR 1500

Also Read: IND Playing 11 vs WI: తెలుగు ఆటగాడికి చోటు.. మూడో స్థానంలో జైస్వాల్‌! తొలి టెస్టు ఆడే జట్టిదే

# England vs Pakistan, Bangladesh vs Pakistan Matches Ticket Price:
Upper Tiers: INR 800
D H blocks: INR 1200
C K blocks: INR 2000
B L blocks: INR 2200

# India vs South Africa and Semi-Final Matches Ticket Price:
Upper Tiers: INR 900
D H blocks: INR 1500
C K blocks: INR 2500
B L blocks: INR 3000

Also Read: TNPL 2023: తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనం.. 5 బంతుల్లో ఐదు సిక్సర్లు! మరో రింకూ సింగ్‌