Rohit Sharma stuns Reporter reply on 2019 World Cup Final at Captain’s Day: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమమయం రానే వచ్చేసింది. భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2203 మహా సంగ్రామానికి సర్వం సిద్దమైంది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్ 2203 ఆరంభం నేపథ్యంలో బుధవారం అహ్మదాబాద్‌లో ‘కెప్టెన్ డే ఈవెంట్’ జరిగింది. ఈ ఈవెంట్‌లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పాలుపోలేదు.
‘కెప్టెన్ డే ఈవెంట్’కు ప్రపంచకప్ 2203లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్ హాజరయ్యారు. కెప్టెన్‌తో సహా బీసీసీఐ, ఐసీసీ అధికారులతో సహా రిపోర్టర్‌లు కూడా పాల్గొన్నారు. రిపోర్టర్‌లు అడిగిన ప్రశ్నలకు కెప్టెన్‌లు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ 2019 వన్డే ప్రపంచకప్ గురించి ఓ ప్రశ్నను రోహిత్‌ను అడిగాడు. ‘గత వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు ఫైనల్‌కు చేరాయి. మ్యాచ్ టై అయింది, ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో.. ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. అలా కాకుండా.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను జాయింట్-విన్నర్‌లుగా ప్రకటించే ప్రయత్నం చేయాల్సింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి?’ అని భారత కెప్టెన్ రోహిత్‌ను ఓ రిపోర్టర్ అడిగారు.
Also Read: Asian Games 2023: క్వార్టర్‌ఫైనల్‌లో పీవీ సింధు ఓటమి.. కనీస పోటీ ఇవ్వకుండానే..!
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అరె.. ఏంటి ఆ ప్రశ్న అని రోహిత్ అన్నాడు. అది నిర్ణయించడం నా పని కాదు సార్ అని రిపోర్టర్ అనగా.. విజేతను ప్రకటించడం నా పని కాదు అని రోహిత్ రిప్లై ఇచ్చాడు. దాంతో అక్కడి వారు నవ్వుకున్నారు. ఇదంతా విన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ముసిముసిగా నవ్వుకున్నాడు. అయితే న్యూజిలాండ్, ఇంగ్లండ్ పేర్లు అర్ధమయినా.. ప్రశ్న ఏంటో అర్ధం కాక ఇంగ్లీష్ కెప్టెన్ జొస్ బట్లర్ ముఖం తేలేశాడు. పక్కనే ఉన్న బాబర్‌ను విషయం అడిగి తెలుకున్నాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Bhole Chature (@memekidiwani) October 4, 2023