OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. సముద్రంలో వేట సాగిస్తుండగా వారి బోటు గేర్ బాక్స్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇంజిన్ పనిచేయక నిలిచిపోయింది. దీంతో బోటు సముద్రంలో గాలివాటానికి కొట్టుకుపోతూ దూర ప్రాంతాలకు చేరుకుంది. దాదాపు 23 రోజులపాటు సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు చివరకు పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి నిన్న రాత్రి సురక్షితంగా చేరుకున్నారు.
బెంగాల్ అధికారులు, వైద్య బృందాలు మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దిఘా నుంచి ఈ ఉదయం 10 గంటలకు స్వస్థలాలకు బయలుదేరిన మత్స్యకారులు త్వరలోనే ఓడలరేవుకు చేరుకోనున్నారు. 23 రోజుల అనిశ్చితి తర్వాత మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తుండటంతో కోనసీమలో ఆనందం వ్యక్తమవుతోంది.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!