NTV Telugu Site icon

Oasis Fertility: సంతాన సాఫల్య చికిత్సలో చరిత్ర సృష్టిస్తున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్

Oasis

Oasis

Oasis Fertility: ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమి సమస్యను అనుభవిస్తున్నారు. అయితే ఇతరులకు దూరం అవుతామనే భయం, బిడియం, అపోహల కారణంగా చాలా మంది సంతాన సాఫల్య చికిత్సల సహాయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. తల్లి అయ్యే వయస్సు పెరగడం, శారీరక వ్యాయామం లేకపోవడం, జంక్‌ ఫుడ్స్‌ను తీసుకోవడం, సరైన, తగినంత నిద్ర లేకపోవడం, పర్యావరణ కారకాలు వంటివి సంతానలేమికి ప్రధాన కారణాలుగా మారాయి. జన్యుపరమైన, వైద్యపరమైన కారణాలు కూడా ఇందుకు తోడవుతున్నాయి. పెళ్లైన ఒక జంట ఒక సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చలేకపోతే ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం చాలా అవసరం.

భారతదేశంలోని విశ్వసనీయ సంతానసాఫల్య కేంద్రాలలో ఒకటైన ఒయాసిస్‌ ఫెర్టిలిటీ, గుంటూరు తన 2వ సంవత్సరపు వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చిన జంటలను సత్కరించడానికి సామూహిక సీమంతం వేడుక నిర్వహించింది. ముఖ్య అతిథిగా గుంటూరు జీజీహెచ్‌ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ (రిటైర్డ్‌) డాక్టర్‌ ప్రభావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక స్త్రీ జీవితంలో సంతానం కలగకపోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అయితే ఇక్కడ గుంటూరులో రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఒయాసిస్‌ ఫెర్టిలిటీ ఐవీఎఫ్‌ ద్వారా 75 శాతం అధిక విజయం సాధించిందని, ఈ విజయం రేటు సాధారణ సగటు 40 కంటే ఎక్కువగా పరిగణించబడుతుందన్నారు. “ఇటువంటి అద్భుతమైన ఫలితాల కోసం ఒయాసిస్‌ ఫెర్టిలిటీని మనం తప్పక మెచ్చుకోవాలి, భవిష్యత్తులో వారు ఐవీఎఫ్‌ ద్వారా 100% ఫలితాలను సాధించగలరు. తల్లిదండ్రులుగా మారడం అనేది ఏ జంటకైనా అతి పెద్ద సంతోషకరమైన విషయం మరియు కౌన్సెలింగ్‌ అందించడం ద్వారా మరియు తక్కువ ఖర్చుతో గర్భధారణను సాధించడం ఒయాసిస్‌ ఫెర్టిలిటీ ద్వారానే సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను.” అని డాక్టర్ ప్రభావతి పేర్కొన్నారు.

ఒయాసిస్‌ ఫెర్టిలిటీ, గుంటూరు కన్సల్టెంట్‌ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వి.రమ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ అధునాతనమైన సంతానసాఫల్య చికిత్సలను మేము అందిస్తున్నాము. మహిళలలో వయస్సు పెరిగే కొద్దీ వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది, కాబట్టి మీకు గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటే వెంటనే సంతానసాఫల్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. మేము పురుషుల కోసం మైక్రో టీఈఎస్‌ఈ (మైక్రోస్కోపిక్‌ టెస్టిక్యులర్‌ స్పెర్మ్‌ ఎక్స్‌ట్రాక్షన్‌) అనే ఒక అధునాతనమైన స్పెర్మ్‌ రిట్రీవల్‌ టెక్నిక్‌ను అందిస్తున్నాము, ఇది స్పెర్మ్‌ కౌంట్‌ లేని లేదా తక్కువ స్పెర్మ్‌ కౌంట్‌ ఉన్న పురుషులు తండ్రులుగా మారడంలో సహాయపడుతుంది. దాతల యొక్క స్పెర్మ్‌ లేదా అండాల కోసం వెళ్లే బదులు దంపతులు తమ సొంత జన్యుపరమైన బిడ్డను కలిగి ఉండాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఇతర సంతానసాఫల్య క్లినిక్‌లలో ఐయూఐ మరియు ఐవిఎఫ్‌ దశల క్రమం విఫలమైన అనేక జంటలు, మా క్లినిక్‌కి వచ్చి మేము అందించిన పీజీటీ (ప్రీఇంప్లాంటేషన్‌ జెనెటిక్‌ టెస్టింగ్‌), ఐవీఎమ్‌, ఎంబ్రియోగ్లూ, మైక్రోఫ్లూయిడిక్స్‌ మొదలైన వాటితో సహా అధునాతన సంతానోత్పత్తి చికిత్స ఎంపికలతో తల్లిదండ్రులు అయ్యే అదృష్టాన్ని అందుకున్నారు. మా విజయాల రేట్లు ఎల్లప్పుడూ 75 శాతం పైనే ఉన్నాయి. క్యాన్సర్‌ రోగులు ఆడవారు అయితే వారి అండాలను లేదా పురుషులైతే వారి స్పెర్మ్‌లను నిల్వ చేయడం ద్వారా వారి సంతానోత్పత్తిని కాపాడుకోవడంలో సహాయపడే ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్‌ టెక్నిక్‌ సదుపాయం కూడా మేము అందిస్తున్నాము మరియు వారి సౌలభ్యం మేరకు తర్వాతి కాలంలో వారు తల్లితండ్రులు కావచ్చు.’’ అని అన్నారు.

ఒయాసిస్‌ ఫెర్టిలిటీ గురించి :
సద్గురు హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో భాగమైన ఒయాసిస్‌ సెంటర్‌ ఫర్‌ రీప్రొడక్టివ్‌ మెడిసిన్‌, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అత్యుత్తమ వైద్య నియమావళిని, పద్దతులను అందుబాటులోకి తీసుకురాడం ద్వారా దక్షిణ భారతదేశంలో సంతాన సాఫల్యానికి ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ కేంద్రంలో కన్సల్టేషన్‌, ఇన్వెస్టిగేషన్‌, ట్రీట్మెంట్లకు సంబంధించి ఈ రంగంలో అమలు అవుతున్నవిధానాలకు భిన్నంగా ఒక సరి కొత్త పద్దతిలో ఒకేచోట, ఒకే రోజు నిర్వహించి తద్వారా కస్టమర్‌ ఫ్రెండ్లీగా ఉంటూ అన్ని వైద్య సేవలను కూడా ఒక్క రోజులోనే ‘ఒన్‌ స్టాప్‌’గా అందిస్తున్నది. 2009లో స్థాపించినప్పటి నుంచి ఒయాసిస్‌ అంతర్జాతీయ అనుభవంతో అత్యంత అనుభవజ్ఞులైన ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ల బృందం నేతృత్వంలో అధిక`నాణ్యత సేవల ద్వారా నడిచే అధిక విజయాల రేట్‌తో అద్బుతమైన ఖ్యాతిని పొందింది. ఒయాసిస్‌ ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, జార్ఖండ్, గుజరాత్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ప్రస్తుతం 30 కేంద్రాలు వున్నాయి.