Site icon NTV Telugu

NV Ramana: “నా కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారు”.. జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు..

Nv Ramana

Nv Ramana

Former CJI NV Ramana: గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఐటీ యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసినా భరించానన్నారు. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయన్నారు. గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురయ్యిందన్నారు. రైతుల కష్టం, త్యాగంతో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు అభినందించారు. రాజధాని అమరావతి నిర్మాణం రైతుల కష్టం, త్యాగాల పునాదులపై జరుగుతోందని జస్టిస్ రమణ అన్నారు. దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాజధాని కోసం ఇంత సుదీర్ఘంగా పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులదేనని కొనియాడారు. కష్టకాలంలో న్యాయ వ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

READ MORE: Jogi Ramesh: జోగి రమేష్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు..

Exit mobile version