NTV Telugu Site icon

Nurse Behaviour with Patient: జుట్టు పట్టుకుని బెడ్ పైకి తోసి ఇంజక్షన్ చేసిన నర్స్

Nurse

Nurse

Nurse Behaviour with Patient : ఓ పేషంట్‎ పట్ల నర్సు వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతోంది. మహిళా పేషంట్ కు ఇంజక్షన్ ఇచ్చేందుకు ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా బెడ్ పై పడుకోబెట్టి ఇంజక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Read Also: Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్‎ కోసం నాలుగేళ్లుగా పోరాడిన మహిళ.. చివరికి..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నర్సు ఒక మహిళా రోగి జుట్టుపట్టుకుని బెడ్‌పైకి తోసింది. సీతాపూర్ జిల్లా ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 18న ఒక మహిళా రోగిని వార్డులో అడ్మిట్‌ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆ మహిళ పట్ల నర్సులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

కాగా, మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్ ఆర్కే సింగ్, ఈ చర్యను సమర్థించారు. అర్ధరాత్రి వేళ ఆ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందని తెలిపారు. దీంతో ఆమెను నియంత్రించేందుకు నర్సులు అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆమెకు ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత సాధారణ పరిస్థితికి వచ్చిందని చెప్పారు. అనంతరం ఆ మహిళను డిశ్చార్జ్‌ చేసినట్లు వెల్లడించారు.

Read Also:Gujarat Farmer : రైతులకు రూ.630కోట్లు ప్రకటించిన ప్రభుత్వం

Show comments