Site icon NTV Telugu

CP Sajjanar: హైదరాబాద్ లో 15% తగ్గిన నేరాల సంఖ్య..

Cp Sajjanar

Cp Sajjanar

హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ వార్షిక నివేదికను విడుదల చేశారు. హైదరాబాదులో నేరాల సంఖ్య 15% తగ్గినట్లు వెల్లడించారు. మహిళల పై నేరాలు, ఫోక్సో కేసుల సంఖ్య పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది 30,690 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా గతేడాది 35944 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది176 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.. 166 కిడ్నాప్ కేసులు 4536 చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడది మహిళలపై జరిగిన నేరాలు ఆరు శాతం పెరిగాయి. అందులో 405 అత్యాచారం కేసులు, 119 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని.. చట్టాన్ని ఎవరు ఉపేక్షించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read:Chicken or Egg Question: “కోడి ముందా? గుడ్డు ముందా..?”.. సమాధానాన్ని కనుగొన్న పరిశోధకులు..

హైదరాబాద్ పోలీసులు చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటారుననారు. పెట్రోలింగ్ మెరుగుగా చేయడం, నిఘా పెంచడంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే గ్యాంగులు కూడా తెలంగాణలోకి రావాలంటే భయపడుతున్నారు.. నగరంలో ఎక్కడ దొంగతనం చేసిన పట్టు పడతామన్న భయం ఇతర రాష్ట్రాల్లో దొంగల్లో ఉంది.. అందుకే చాలామంది నేరస్తులు నగరానికి రావాలంటే భయపడుతున్నారు.. సైబర్ క్రైమ్ పై అవేర్‌నెస్ తీసుకురావడంతో చాలా వరకు కేసుల సంఖ్య తగ్గాయని సీపీ తెలిపారు. సోషల్ మీడియాలో అన్ని నేరాలపై అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము.. సైబర్ క్రైమ్ టీమ్ లు మెరుగ్గా పనిచేశారు.. ఈ ఏడాది 566 మంది సైబర్ నేరస్తులని అరెస్టు చేశామన్నారు.

ప్రతి మంగళవారం, శనివారం ప్రజల్లోకి వెళ్లి అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము.. హైదరాబాద్ వాసుల నుండి మంచి స్పందన ఉంది. అత్యాశకు హద్దు ఉండదు అందులో భాగంగానే కొంతమంది సైబర్ నేరస్తుల బారిన పడుతున్నారు.. డబ్బులు ఊరికే రావు అనేది ప్రజలందరూ గుర్తుంచుకోవాలి.. ఎవరు కూడా సైబర్ నేరస్తుల బారిన పడి బలి కావద్దు అని సూచించారు. 120 అకౌంట్లను సీజ్ చేసామన్నారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం తెలంగాణ ప్రభుత్వం గోల్ పెట్టుకుంది. ఆ గోల్‌కు తగ్గట్టుగా హైదరాబాద్ పోలీసులు నార్కోటిక్స్ టాప్ ప్రయారిటీగా పెట్టుకొని పని చేస్తున్నాము.. అందుకోసమే చిన్న విందును ఏర్పాటు చేసి ఓడిసిపి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నాము. ఈ ఏడాది 368 డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. ఆరున్నర కోట్ల రూపాయల డ్రగ్స్ ని సీజ్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో టీంల సంఖ్యను పెంచుతామని తెలిపారు. డ్రగ్స్ సప్లై చేసే నెట్‌వర్క్ నిషేధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. డ్రగ్స్ కు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ఉక్కు పాదం మోపపోతున్నాము.. పట్టుకున్న వారికి తగిన శిక్ష పడేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాను.

Also Read:Varanasi :ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు పాత్రల్లో మహేష్ బాబు!

రాబోయే రోజుల్లో ఎన్‌డీపీఎస్ వింగ్ ఏర్పాటు చేసి డీసీపీ స్థాయి అధికారిని పెట్టబోతున్నాము ఈ ఏడాది 4463 మందికి శిక్షపడేలాగా చేశామన్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ నగరవాసులకు పెద్ద సమస్యగా మారింది. ఈ ఏడాది రోడ్డు యాక్సిడెంట్ చాలావరకు తగ్గాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై చాలాకాలంగా అవేర్‌నెస్ చేస్తూ వస్తున్నాము. 49732 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.. న్యూ ఇయర్ సందర్భంగా 126 ప్రత్యేక టీం లు పనిచేయబోతున్నాయని సజ్జనార్ వెల్లడించారు. న్యూ ఇయర్ రోజు తాగి వాహనాలు నడపొద్దని కోరుతున్నాము.. హైదరాబాద్ వాసులు పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా సహకరించాలని సీపీ కోరారు.

Exit mobile version