NTV Telugu Site icon

Numaish Exhibition: జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నుమాయిష్‌

Numaish

Numaish

Numaish Exhibition: జనవరి 1 నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌(నుమాయిష్-2024) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని నుమాయిష్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 8 దశాబ్దాలుగా తెలంగాణకు నుమయిష్ ఓ ప్రైడ్ అంటూ ఆయన పేర్కొన్నారు.

Read Also: Drugs Detection Test Kits: న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసుల సరికొత్త స్టెప్.. రంగంలోకి డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్

ఎన్నో రాష్ట్రాల నుండి విజిటర్స్ గతం నుంచి వస్తున్నారని.. నిజాం కాలం నుంచి ఈ ప్రదర్శన ఉందన్నారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. తనను సొసైటీ ప్రెసిడెంట్‌గా ఎంచుకోవడం సంతోషమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 1 ప్రారంభిస్తారని వెల్లడించారు. పారిశ్రామిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫైర్, హెల్త్, అంబులెన్స్ విషయంలో జాగ్రత్తలు సొసైటీ తీసుకుందన్నారు. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు వచ్చేవాళ్లు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారని మంత్రి చెప్పారు.

Read Also: Telangana: కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఎంతో మంది ఇక్కడికి వచ్చే వ్యాపారం చేస్తున్నారని, వారికి ప్రోత్సాహం సొసైటీ అందిస్తుందన్నారు. స్టాల్స్‌ విషయంలో సొసైటీ జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రదర్శనతో వచ్చే ఆదాయంతో 20కి పైగా విద్యాసంస్థలు నడుస్తున్నాయని.. 30వేల మంది మహిళలకు విద్య అందుతుందన్నారు. వాణిజ్య వ్యాపారంలో ఈ నుమయిష్ ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాట్లు చేశామన్నారు.