Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.దళితులపై చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాదని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుపై కాంగ్రెస్‌, బీజేపీ అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. దళితులపై బీజేపీ ప్రేమ కల్లబొల్లి మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమి లేదని హరీష్‌ రావు అన్నారు. దళిత బంధు వంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని.. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా పథకాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

https://ntvtelugu.com/harish-rao-was-highly-critical-of-the-bjp/

2.ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఒక మహిళ వేడుకొంటుంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతని పేరుపై బదలాయించాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఒకసారి తనపై హత్యాయత్నం చేశారని… డాక్టర్లు సకాలంలో నాలుగు సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ఆరోపిస్తోంది. నగర పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. సైదాబాద్ లో మీడియా తో బాధితురాలు బోడ పద్మ వివరాలు వెల్లడించారు.

https://ntvtelugu.com/husband-harassed-his-wife-for-assets/

3.ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ నెల పార్ల‌మెంబ్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా… ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన పార్ల‌మెంట్‌లో 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. రెండు విడ‌త‌ల‌గా బ‌డ్జెట్ సెష‌న్ జ‌ర‌గ‌బోతోంది.. అయితే, ప‌న్ను రహిత ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిమితిని పెంచే సూచనలు క‌నిపిస్తున్నాయి.. 

https://ntvtelugu.com/tax-free-provident-fund-limit-may-be-raised-to-rs-5-lakh/

4.దేశంలో ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి నైట్‌ కర్ఫ్యూను విధించారు. మరి కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను విధించడంతో పాటు కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్‌ కూడా వేగంగా విజృంభిస్తూ పంజా విసురుతుంది. వ్యాక్సినేషన్‌ పూర్తిగా వేసుకున్న తట్టుకోవడం అంత సులువేం కాదనే అభిప్రాయానికి ప్రభుత్వాలు వచ్చాయి.

https://ntvtelugu.com/omicron-is-spreading-rapidly-in-the-country/

5.రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కామర్స్ సంస్థలే కాదు విమానయాన సంస్థలు కూడా ప్రత్యేకంగా పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ విమానయాన కంపెనీ ‘గో ఫస్ట్’ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిపబ్లిక్ డే సందర్భంగా విమాన టిక్కెట్లను అత్యంత చౌకగా అందుబాటులోకి తెచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా ‘రైట్ టూ ఫ్లై’ పేరుతో రూ.926కే విమాన ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

https://ntvtelugu.com/go-first-flights-republic-day-special-offer/

6.జార్ఖండ్‌లో మావోయిస్టులు వ‌రుస‌గా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెన‌ను మావోయిస్టులు తెల్లవారు జామున పేల్చేశారు. అంతేకాకుండా, జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్‌ను పేల్చేశారు. మరో టవర్‌కు నిప్పుపెట్టి క‌ల‌క‌లం రేపారు. మావోయిస్టుల నేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోలు ప్రస్తుతం రెసిస్టెన్స్ వీక్‌ను పాటిస్తున్నారు. 

https://ntvtelugu.com/maoists-blow-up-a-bridge-in-jharkhand/

7.ఎన్టీవీ ఎంటర్ టైన్మెంట్… తన పేరుకు తగ్గట్టే వీక్షకులకు హండ్రెడ్ పర్సంట్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. నయా సాల్ లో ‘మ్యూజిక్ ఎన్ ప్లే’ ప్రోగ్రామ్ తో ఇది రెట్టింపు అయ్యింది. పాపులర్ సింగర్ సాకేత్ కొమాండూరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మ్యూజిక్ ఎన్ ప్లే’ కార్యక్రమం లాస్ట్ సండే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. తమన్ తో శుభారంభమైంది. 

https://ntvtelugu.com/music-n-play-latest-promo/

8.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మరో అరుదైన ఘనత దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసింది.

https://ntvtelugu.com/the-kaleswaram-project-got-another-recognition/

9.కార్ల షోరూంకి వెళ్లే వినియోగదారుల పట్ల కొంతమంది సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తూ వుంటారు. పంచె కట్టుకుని కారుకొనేందుకు వెళ్ళిన రైతుని అవమానపరిచాడో సేల్స్ మ్యాన్. అయితే, రైతు ఆ సేల్స్ మ్యాన్ కి ధీటైన జవాబిచ్చాడు. అచ్చం స్నేహం కోసం సినిమా తరహాలోనే ఒక సీన్ కర్నాటకలోని ఓ మహీంద్రా షోరూమ్​లో జరిగింది.

https://ntvtelugu.com/mahindra-salesman-insults-farmer-in-karnataka/

10.ప్ర‌ముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్‌, కాద‌లన్ (ప్రేమికుడు), కాద‌ల్ దేశం’ (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాష‌ల‌లో బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సినిమా ప‌బ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె. టి. కుంజుమన్ జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప‌తాకంపై తన సూపర్ హిట్ సినిమా ‘జెంటిల్ మేన్‌’కు సీక్వెల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవ‌ల ట్విట్టర్ లో ఒక కాంటెస్ట్‌ను నిర్వ‌హించారు.

https://ntvtelugu.com/keeravani-will-compose-music-for-k-t-kunjuman-gentleman-2-movie/
Exit mobile version