నేడు మేడిగడ్డకు కేంద్ర జలసంఘం సభ్యులు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఈరోజు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ ను పరిశీలించనున్నారు.
నాకు సీఎం కావాలని కోరిక ఉంది.. కచ్చితంగా సీఎం అవుతా
సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు.
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ లకు సెలవు..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. నేడు విజయదశమి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు, రిమాండ్ ఖైదీల కుటుంబ సభ్యులు సహకరించాలని జైలు అధికారులు కోరారు.
“నిజం గెలవాలి” కార్యక్రమంతో ప్రజల్లోకి నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
దేవరగట్టు బన్నీ ఉత్సవంపై ఉత్కంఠ.. కర్రల సమరంపై పోలీసుల వ్యూహాం
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండపై కొలవైన ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి గొడవల వల్ల కర్రల సమరంగా ఆ పేరు వచ్చింది. ఇది సమరం కాదు.. సంప్రదాయం అని అక్కడి భక్తులు అంటున్నారు. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి ఇక హైవోల్టేజీ ఉంటుంది.
Road Accident: తమిళనాడులో రోడ్ టెర్రర్.. లారీ-సుమో ఢీ, 7 మంది మృతి
పండగపూట తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద ప్రభుత్వ బస్సు, సుమో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్క కత్తితో ఎంత పెద్ద విషయాన్ని రివీల్ చేసావ్ కొరటాల…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో స్టార్ట్ కానుంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఎన్టీఆర్ ది ఒక్క పోస్టర్ మాత్రమే ఉంది. ఇందులో ఎన్టీఆర్ బల్లెం పట్టుకోని, బ్లాక్ డ్రెస్ లో భయంపుట్టించే వీరుడిలా ఉన్నాడు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ఎడమ చేత్తో ఆయుధాన్ని పట్టుకున్నాడు. లేటెస్ట్ గా దసరా ఆయుధపూజ అంటూ కొరటాల శివ మరో పోస్టర్ వదిలాడు. అందులో కేవలం కత్తిని మాత్రమే రివీల్ చేసాడు కొరటాల. ఈ కత్తిని కూడా ఎన్టీఆర్ ఎడమ చేత్తోనే పట్టుకున్నాడు. సో కొరటాల డిజైన్ చేసిన దాన్ని బట్టి ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎడమ చేతి వాటం అనమాట. మరి యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎలాంటి స్పెషలిటీని డిజన్ చేసారు అనేది చూడాలి.
