NTV Telugu Site icon

Top Headlines@5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి మండలి నిర్ణయించినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయడం ఎన్నికల స్టంటే అని ఆయన కుండబద్దలు కొట్టారు. పీర్జదిగుడా, బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లలో వివిధ కార్యక్రమలకు మంత్రి మల్లారెడ్డి హాజరు అయ్యాడు. పీర్జదిగుడా పార్టీ కార్యాలయం దగ్గర కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్, కార్పొరేటర్లు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం ఎన్నికల స్టంట్ హ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అవును ఎన్నికల కోసమే అనుకో ఏమైనా అనుకొర్రీ కార్మికులు మాత్రం ఎంతో సంతోషిస్తున్నారని సమాధానం ఇచ్చారు. మాది రాజకీయ పార్టీ అని.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్స్ అనేవి ఎలాగైనా వుంటాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం, ఫండ్స్ కావాలన్నారు. అవన్నీ తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అయితే, గత నెల 31వ తేదిన సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం అయింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న డిసిషన్ పై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ చిత్రపాటానికి పాలభిషేకం చేస్తున్నారు.

 

*ఇస్నాపూర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు మెట్రోరైలు వస్తుంది
ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 118 జీవో సమస్య పరిష్కారం అయిందని, ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ఇండ్లు రిజిస్ట్రేషన్ అవ్వక ఇబ్బంది పడుతున్నారన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్లు మెట్రో వెంటనే కలుపుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇటు పెద్ద అంబరుపేట వరకు మెట్రోరైలు తెస్తామని, ఇస్నాపూర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు మెట్రోరైలు వస్తుందన్నారు. నమ్మశక్యం కానీ పనులు కూడా కేసీఆర్ పూర్తి చేసి నిరూపించారని, తెలంగాణ అలాగే సాధించారన్నారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేశారని, ఇంటి ఇంటికి నీళ్లు కూడా ముందు ఎవరూ నమ్మలేదన్నారు మంత్రి కేటీఆర్‌. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేస్తున్నామని, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి కేటీఆర్‌. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేస్తున్నామని, ఎస్‌ఆర్‌డీపీ, మెట్రోరైలు ఎంతో ఉపయోగ పడుతాయని, 415 కిలోమీటర్ల మెట్రోరైలు నగరం చుట్టూ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ సమస్య ఏర్పడిందని, ఒక అధికారి చేసిన తప్పు వల్ల ఈ సమస్య ఏర్పడిందని, 14 కొత్త బ్రిడ్జి లు మూసి మీద కడుతున్నామన్నారు. ఎలక్షన్ టైం లో రాజకీయాలు చేద్దామని ఆయన వ్యాఖ్యానించారు.

 

*రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు..
మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆర్భాటం లేకుండా పనులు చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 3సార్లు ముఖ్యమంత్రి అయినా ఏం చేశారంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అవినీతికి తావులేకుండా జగన్మోహన్ రెడ్డి పనులు చేస్తున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని బురద చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 23 సీట్లు కాదు కదా.. ఈ సారి ఒక్క సీటు కూడా రాదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ పార్టీ తలుపులు మూసుకోబోతున్నాయన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ మంత్రి అన్నారు. రాయలసీమలో పుట్టి రాయలసీమనే అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలుచిపోతాడన్నారు. రెండు వేల నోట్లు తన వల్లే క్యాన్సల్ అయ్యింది అంటూ చంద్రబాబు మాట్లాడతారని.. ఆయనకు చిన్న మెదడు చితిగిపోయిందేమో అని మంత్రి ఎద్దేవా చేశారు. ఆయన ఏం మాట్లాడుతిన్నాడో ఆయనకే అర్థం కావడం లేదు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

 

*పెరుగుడే కానీ తగ్గేదిలేదు.. ఇంకా ఎన్నిరోజులు..!
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలకు ద్రవ్యోల్బణం భారంగా మారింది. గత నెలలో టమాటా ధర పలు నగరాల్లో కిలో రూ.300 దాటగా.. చండీగఢ్‌లో కిలో టమాటా ధర రూ.350కి అమ్ముడుపోయింది. అయితే గత 10 రోజులుగా టమాటా ధర కొంతమేర తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కిలో 100 నుంచి 150 రూపాయలకు అమ్ముడు పోతుంది. దీంతో సామాన్య ప్రజానీకానికి కొంత ఊరట లభించినట్లైంది. అయితే ఈ ఆశ ఎక్కువ కాలం ఉండేలా కనిపించడం లేదు. త్వరలోనే టమాటా ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. మళ్లీ టమాటా ధర కిలో రూ.200 దాటుతుందని అంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. హోల్‌సేల్ వ్యాపారులే టమోటాలను కిలో రూ. 200 చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలుపుతుంది. ఇలాంటి పరిస్థితిల్లో.. రిటైల్ మార్కెట్‌లో ధరలు ప్రభావితం కానున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ మార్కెట్‌లో 25 కిలోల టమోట క్రేట్.. ధర 4,100 రూపాయలు ఉంది. అయితే ఢిల్లీకి చెందిన వ్యాపారులు ఉత్తరాఖండ్‌లోని మండి నుంచి టొమాటోలను కొనుగోలు చేస్తే రవాణా ఛార్జీలు, కమీషన్ మరియు ఇతర ఛార్జీలు కలిపితే.. ఒక టమాటా క్రేట్ ధర రూ. 5,000 వరకు చేరుతుంది. దీంతో రిటైల్ మార్కెట్‌లో మరోసారి టమాట ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త.. డెహ్రాడూన్‌లో ఒక్కో క్రేట్‌ రూ.4,100 చొప్పున టమాట కొనుగోలు చేశాడు. ఇప్పుడు అది ఢిల్లీకి వచ్చేసరికి 5000 వేలకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిటైల్ మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.200 దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ రిటైల్ మార్కెట్‌లో టమోటా కిలో రూ.150 నుంచి 180 వరకు విక్రయిస్తున్నారు. టమాట ధరలపై కూరగాయల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అనిల్ మల్హోత్రా మాట్లాడుతూ.. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఢిల్లీకి టమాటాలు సరఫరా అవుతున్నాయన్నారు. 2021 మరియు 2022 సంవత్సరాల్లో టమోటాలు బాగా పండాయని.. అప్పుడు రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించలేదని తెలిపారు. కానీ ఈ ఏడాది రైతులు టమోటా సాగును తగ్గించడంతో ఉత్పత్తిపైనా ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు.

 

*ఇప్పట్లో లోక్‌సభకు రాను…. అధికార, విపక్షాల తీరుపై స్పీకర్‌ అసంతృప్తి
లోక్‌సభలో అధికార, విపక్షాలు వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పక్షాల సభ్యులు తమ తీరును మార్చుకునే వరకు తాను లోక్‌సభకు రానని స్పష్టం చేశారు. మణిపూర్‌ అంశంపై చర్చకు సంబంధించి ఇటు విపక్షాలతోపాటు.. అటు అధికార పక్షం వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మణిపూర్‌ అంశంపై దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. అలాగే చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మణిపూర్‌ అంశంపై స్వల్ప కాలిక చర్చ చేపడతామని.. చర్చకు హోం శాఖ మంత్రి అమిత్‌ సమాధానం ఇస్తారని చెబుతోంది. దీంతో పార్లమెంటు సమావేశాలు స్థంభిస్తున్నాయి. మణిపూర్‌ అంశంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే ఈ వ్యవహారాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. ఎంపీల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారు. ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సెషన్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్‌ నినాదాల నడమే ఇవాళ్టి లోక్‌సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్‌ అంశంపై రూల్‌ 267 ప్రకారం సుదీర్ఘ చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి…. ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తుండగా.. రూల్‌ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చతోనే సరిపెడతామని.. చర్చకు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం చెబుతారని కేంద్రం చెబుతోంది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సక్రమంగా జరగడం లేదు.

 

*హర్యానాలో అల్లర్లతో ఢిల్లీలో అలర్ట్
హర్యానాలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ అయ్యారు. హర్యానాలో మాదిరిగా ఢిల్లీలో అల్లర్లు జరగకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల సెగ దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. నుహ్ జిల్లాలో అల్లర్లకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), భజరంగ్ దళ్‌ ర్యాలీలు నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆయా సంఘాలు చేపట్ట తలపెట్టిన ర్యాలీలను రద్దు చేయాలని కోరుతూ పిటీషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నుహ్, గుర్‌గ్రామ్‌లలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అల్లర్లను ప్రేరేపించే చిన్న సంఘటన కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కావున అల్లర్లను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు. హర్యానా ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్‌లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. హర్యానాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఇతర వర్గం వారు దాడి చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు వందల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. అల్లర్లను అదుపుచేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్‌నెట్‌ను సైతం నిలిపివేసింది.

 

*ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్‌ ఆఫర్‌
భారత దేశంలోనే అతి పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు.. విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వ్యక్తులకు కంపెనీ రూ. 2000 వరకు తగ్గింపును ఇస్తోంది..ఈ సేల్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ‘యానివర్సరీ సేల్’ను ప్రారంభించింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కంపెనీ ఆఫర్ ఆగస్టు 2 నుంచి 4 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ కాలంలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి, తగ్గింపు ధరపై రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఆఫర్‌కి ‘HappyIndiGoDay’ అని పేరు పెట్టింది.. ఈ సంస్థకు సంబందించిన విమాన టికెట్ లను మొబైల్, వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసేవారికి అన్ని టిక్కెట్‌లపై 12 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉండగా, ఆగస్టు 4న టికెట్ బుక్‌పై 7 శాతం తగ్గింపు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తగ్గింపు పరిమితి రూ.2,000 వరకు ఉంటుంది.. ఇకపోతే ఈ ఆఫర్ కోసం అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్‌బిసి క్రెడిట్ కార్డ్‌ల తో కూడా టైఅప్ చేసింది. దీనిపై ప్రజలు అదనపు ప్రయోజనం పొందుతారు. ఆగస్టు 2న అంటే ఈ రోజున టిక్కెట్లను బుక్ చేసుకుంటే వారికి 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కస్టమర్‌లకు, కనీస ఆర్డర్ విలువ రూ. 5,000 పై రూ. 2,000 వరకు క్యాష్‌ బ్యాక్ ఉంటుంది.. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్‌లో ఉన్నప్పుడు ప్రజలు రూ. 3500 ఆర్డర్ విలువ పై 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ కార్డ్‌పై ఆఫర్ ఆగస్టు 4 వరకు చెల్లుబాటులో ఉంటుంది. గరిష్ట తగ్గింపు పరిమితి రూ.2,000. ఇది మాత్రమే కాదు.. ఇష్టమైన సీటును కూడా ఎంపిక చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..

 

*ఇండిపెండెన్స్ డే స్పెషల్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక అమ్మకాలు
ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక అమ్మకాలు నిర్వహించనుంది. అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ పేరుతో ఈ సేల్స్ జరుగనుండగా.. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఆఫర్ సేల్ ఉండనుంది. అంతేకాకుండా.. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఈ ఆఫర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకే అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ లో.. అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. అన్ని రకాల స్మార్ట్ ఫోన్లకు సంబంధించి.. మంచి ఆఫర్లు ఇవ్వనుంది. శామ్ సంగ్ గెలాక్సీ ఎం14 5జీ, వన్ ప్లస్ నార్డ్ 3, వన్ ప్లస్ 11 ఆర్, రియల్ మీ నార్జో 60 ప్రో, గెలాక్సీ ఎం04, వన్ ప్లస్ 11, ఐకూ నియో 7 5జీ, రెడ్ మీ నోట్ 12 5జీ, ఐకూ జెడ్7ఎస్, రియల్ మీ నార్జో ఎన్55, ఐకూ జెడ్ 6 లైట్ వాటి మోడళ్లపై భారీగా ఆఫర్లు రానున్నాయి. అయితే వీటి ధరలను ఇంకా తెలుపలేదు. అయితే ఈ సేల్ లో.. స్మార్ట్ ఫోన్లు తీసుకోవాలనుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ల్యాప్ టాప్ లపై 75 శాతం వరకు, స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. అంతేకాకుండా యాపిల్ ఉత్పత్తులు, టీవీలు, రిఫ్రిజిరేటర్లపైనా మంచి ఆఫర్లు ఇవ్వునున్నట్లు తెలుస్తోంది. అటు ఫ్లిప్ కార్ట్ కూడా ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాకుండా.. పేటీఎం చెల్లింపుల పైనా స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉండనుంది. టీవీలు, అప్లయన్సెస్ పై 75 శాతం వరకు డిస్కౌంట్ రానుంది. అయితే ఏ వస్తువుకు ఎంత ఆఫర్లు అనేది.. 3వ తేదీన తెలిసే అవకాశం ఉంది.

 

*వెస్టిండీస్తో జరిగిన 3వ వన్డేలో భారత్ రికార్డు.. ఎందుకో తెలుసా..!
వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. భారత్ సిరీస్ ను దక్కించుకుంది. అంతేకాకుండా రికార్డు నెలకొల్పింది. మొదటి వన్డేలో భారత్ గెలవగా.. రెండవ వన్డేలో వెస్టిండీస్ గెలిచింది. చివరి వన్డేలో ఇరుజట్లు.. సిరీస్ కోసం పోటీపడగా అది ఇండియా వశమైంది. అంతేకాకుండా వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్ లో ఓడి ఘోర పరాభవాన్ని ఎదురుచూసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా వెస్టిండీస్‌పై ఇండియా అతిపెద్ద విజయం సాధించింది. గతంలో ఇంగ్లండ్‌ 186 పరుగుల విజయలక్ష్యంతో రికార్డు సృష్టించగా.. తాజాగా 200 పరుగుల తేడాతో ఇండియా రికార్డు సాధించింది. అయితే ఇండియా తరుఫున ఓపెనర్లు.. భారీ స్కోరు చేసినందుకు ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నారు. గిల్, ఇషాన్ కలిసి 143 పరుగులు చేశారు. ఈ స్కోరు వెస్టిండీస్ పై భారత్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా.. ఇంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఉండేవాడు. ఒకే మ్యాచ్ లో 7 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు సెహ్వాగ్ తర్వాత మూడో వన్డేలో.. 5 సిక్సర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా నిలిచాడు. మూడో వన్డేలో భారత్ 351 పరుగులు చేయగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టీమిండియా 350 ప్లస్ స్కోరు నమోదు చేయడం ఇది నాలుగోసారి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇంకా ODI మ్యాచ్ లు ఆడేందుకు ఉన్నాయి. మరో రికార్డు ఏంటంటే.. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌ గా ఇషాన్ నిలిచాడు. చివరిసారిగా 2020లో శ్రేయాస్ అయ్యర్ ఇలాంటి ఫీట్ చేశాడు.

 

*మెగా ఇంటికి అల్లుడు.. పెళ్లి వార్తలపై స్పందించిన తరుణ్!
టాలీవుడ్‌ లవర్ బాయ్, హీరో ‘తరుణ్‌’ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెలతో తరుణ్ పెళ్లి అంటూ నెట్టింట ఇటీవలి రోజుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా తరుణ్‌ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ నిజం లేదని స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిజంగా నాకు పెళ్లి ఫిక్స్ అయితే నేనే స్వయంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటా. సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా నా పెళ్లి వార్త చెబుతా. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు అర్ధం కావడం లేదు’ అని హీరో తరుణ్‌ అన్నారు. తరుణ్‌ స్వయంగా పెళ్లి వార్తలపై స్పందించడంతో నెట్టింట వచ్చే పుకార్లకు చెక్ పడింది. తరుణ్‌ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి మాట్లాడారు. త్వరలోనే తన కొడుక్కి పెళ్లి చేస్తానని, అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో నెటిజన్లు పలు పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. చివరకు మెగా ఫ్యామిలీ అల్లుడు అని ఫిక్స్ అయ్యారు. ఈ వార్తలు తరుణ్ వద్దకు చేరడంతో.. స్వయంగా స్పందించి వదంతులకు పులిస్టాప్ పెట్టారు. ‘మనసు మమత’తో తరుణ్‌ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాల నటుడిగా పలు చిత్రాలలో నటించారు. 2000లో విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రేమ కథల్లో నటించి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాలో తరుణ్ చివరగా నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్.. బిజినెస్‌లో బిజీగా ఉన్నారు.