*సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దశాబ్ది వేడుకలు సందర్భంగా.. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తుందన్నారు. జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
*జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ
జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణ దశాబ్ది వేడుకలు సందర్భంగా.. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తుందన్నారు. జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
*బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అందరికి ఉచిత విద్య అందిస్తాం
బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అందరికి ఉచిత విద్య అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ శుభకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటున్నామన్నారు. పార్లమెంట్ లో సుష్మాస్వరాజ్ తెలంగాణ కోసం మాట్లాడారని గుర్తు చేశారు. బలిదానాలు వద్దు అని చెప్తు యువతకు ధైర్యాన్ని ఇచ్చింది సుష్మాస్వరాజ్ అని గుర్తు చేశారు. ఆశయాలకు భిన్నంగా తెలంగాణలో పాలనా సాగుతుందని మండిపడ్డారు. నలుగురి వల్ల దేశంలో రాష్ట్రం నవ్వులపాలయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, యువత, రైతులు ఎవరిని కలిసిన ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం.. ఏం జరుగుతుంది అని అడుగుతున్నారని బండి తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్ళామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అందరికి ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇప్పుడు కనీసం చాక్ పీస్ కూడా లేని పరిస్థితి లేదని గుర్తు చేశారు. సంవత్సరం ముందే ఫీజ్ రీయంబర్మెంట్స్ చేస్తామని బండి సంజయ్ అన్నారు. 25వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చేసిన యాత్రలు చేసారని గుర్తు చేశారు. బీజేపీ కృషి ఫలితంతోనే రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. 1400 కోట్ల అమరుల బలిదానాలతో ఈ తెలంగాణ ఏర్పడిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. అన్ని అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుందన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రం నడుస్తుంది.. ప్రజలు బతుకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు లక్షల కోట్ల రూపాయల నిధులను తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ మారిందన్నారు.
*వైఎస్సార్ యంత్ర సేవా పథకం
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లయితేనేమి, వ్యవసాయ పరికాలైతేనేమి.. ఇటువంటివన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రైతన్నలే గ్రూపు కింద ఫామ్ అయ్యి, ఆర్బీకే పరిధిలో ఉన్నమిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో, ఆర్బీకేలతో అనుసంధానమై, ఆర్బీకే పరిధిలోని రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారన్నారు.గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం ఈరోజు జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఇంతకు ముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ఓపెన్ చేశామన్నారు. అక్కడ 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సప్లయ్ చేశామని సీఎం చెప్పారు. ఈరోజు 3,919 ఆర్బీకే స్థాయిలో, మిగిలిన వంద క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అన్నింట్లోనూ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులో ఉండేటట్లు ఈరోజు కార్యక్రమంతో జెండా ఊపి స్టార్ట్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆర్బీకే స్థాయిలో కూడా 15 లక్షల రూపాయలు కేటాయింపు చేసి అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలన్నా ఆ రైతుల్నే డిసైడ్ చేయాలని చెప్పి.. వాళ్లు డిసైడ్ చేసిన దాని ప్రకారం 15 లక్షలతో వారి అవసరాల మేరకు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. 491 క్లస్టర్ స్థాయిలో వరి బాగా పండుతున్న ప్రాంతాల్లో అక్కడ కంబైన్ హార్వెస్టర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించిన స్థాయిలో 491 క్లస్టర్లను ఐడెంటిఫై చేశామని ఆయన చెప్పారు.
*పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన
ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వబోతోందన్నారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మతుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఎంపీ జీవీఎల్.. తొమ్మిదేళ్ల కాలంలో రూ. 55 వేల కోట్ల మేర నరేగా నిధులిచ్చిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఏపీకి చేకూరినంత లబ్ధి మరెవరికీ చేకూర్చలేదన్నారు. ఏపీకి ప్రధాని మోడీ సరికొత్త వరాలు ప్రకటించారని.. రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారన్నారు. స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారని ఆయన చెప్పారు. ఈ రూ. 10 వేల కోట్ల నిధులు ఏపీ ప్రజలకు వరమన్నారు. రాష్ట్రం ఈ నిధులను కేంద్రం నుంచి గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టు వైసీపీ చెప్పుకుంటోందని ఆయన మండిపడ్డారు. మేం నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. 2016 నుంచి ఇప్పటి వరకు రూ. 16,984 కోట్లు అదనపు రుణం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకున్నాయన్నారు. దీంతో కేంద్రం అప్పులపై పరిమితి విధించిందని ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కూడా రూ. 8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదట మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించిందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 2667 కోట్ల మాత్రమే కోత విధించి.. సుమారు రూ. 5 వేల కోట్ల మేర రుణ వెసులుబాటు కల్పించామని ఈ సందర్భంగా చెప్పారు.
*టాయిలెట్‌లో 16 బంగారు బిస్కెట్లు స్వాధీనం
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్ నుండి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. కస్టమ్ బృందం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలోని ప్రధాన టెర్మినల్ భవనంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా బంగారాన్ని టాయిలెట్‌లో దాచిన ప్రయాణీకులను గుర్తిస్తున్నారు. షార్జా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ శాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి బుధవారం షార్జా నుంచి వారణాసి విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 184 నుండి వస్తున్న ప్రయాణికులను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రయాణీకుల తనిఖీ పూర్తయిన తర్వాత, బృందం సాధారణ తనిఖీ కోసం టాయిలెట్‌కు కూడా తనిఖీ చేసింది. టాయిలెట్‌లోని విచారణలో, ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్ లో ఈ బంగారం పట్టబడింది. మరుగుదొడ్డిలోబంగారం దొరకడంపై అధికారులు విచారణ జరిపి, ఆపై దానిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ టీమ్ దానిని తెరవగా అందులో నుంచి 16 బంగారు బిస్కెట్లు లభించాయి. రికవరీ చేసిన బిస్కెట్ల బరువు 1866.100 గ్రాములు కాగా ధర కోటి పన్నెండు లక్షల యాభై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఉంటుందని తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం మరుగుదొడ్లకు వెళ్లే ప్రయాణికులను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కస్టమ్ టీమ్ గుర్తిస్తోంది. స్వాధీనం చేసుకున్న బంగారం విదేశీదిగా గుర్తించారు.
*విద్యార్థినులు హిజాబ్ ధరించాలని బలవంతం
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది గర్ల్స్ స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూల్ యాజమాన్యం బలవంతం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మే 30న తమకు ఎన్‌సిపిసిఆర్ ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల కుటుంబాలను కలిశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే, దీనిపై తల్లిదండ్రులెవరూ ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు. అమ్మాయిల స్కూల్ డ్రెస్ కోడ్‌లో స్కార్ఫ్ లు, సల్వార్, కుర్తా ఉంటాయి. గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ వీహెచ్ పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ సహా మితవాద సంఘాలు నిరసన తెలిపాయి. అమ్మాయిలు హిజాబ్ ధరించలేదు, బదులుగా స్కార్ఫ్‌లు మాత్రమే ధరించారు. ఇది పాఠశాల దుస్తుల కోడ్‌లో భాగం మాత్రమే.. హిజాబ్ మొత్తం శరీరాన్ని కప్పివేస్తుంది.. స్కార్ఫ్ ఛాతీ వరకు మాత్రమే కప్పబడుతుంది.. మేము ఏ విద్యార్థినీ వారి సంప్రదాయాలు, సంస్కృతులకు వ్యతిరేకంగా ధరించమని బలవంతం చేయలేదని స్కూల్ డైరెక్టర్ ముస్తాక్ మహ్మద్ వెల్లడించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. ఇప్పటికీ మేము ఈ విషయంపై లోతైన విచారణ కోసం దామోహ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కోరామని మిశ్రా చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విచారణకు ఆదేశించారు. విచారణలో వెల్లడైన నిజాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని సీఎం చౌహాన్ చెప్పారు.
*తూలి కింద పడిన అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్..
అగ్ర రాజ్యానికి అధిపతి అయినా ఆయన తన చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అతనెవరో కాదు అమెరికా అధ్యక్షులు జో బైడెన్. ఉన్నట్టుండి మరచిపోవడం.. ఒకవైపు వెళ్లాల్సి ఉండి మరోవైపు వెళుతుండటం.. ఉన్నట్టుండి కిందపడిపోవడం ఇటువంటి చేష్టలతో ఆయన సోషల్ మీడియాలో ఉంటారు. గురువారం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న జో బైడెన్ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ముందుకు పడిపోయారు.కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన మిలటరీ గ్రాడ్యుయేట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభ ప్రసంగం ముగిసన అనంతరం క్యాడెట్స్ తో కరచాలనం చేసిన తరువాత నడుచుకుంటూ ముందుకు వెళుతున్న సందర్భంలో ఒక్కసారి తుళ్లి కిందపడ్డారు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అధ్యక్షున్ని పైకి లేపి అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. బైడెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని .. క్షేమంగానే ఉన్నారని.. క్యాడేట్స్ తో కరచాలనం చేసి వస్తున్న క్రమంలో ఇసుక బస్తా ఉండటంతో తగిలి కింద పడ్డారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బెన్ లాబోల్ట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ మరియు మెరైన్ వన్ ద్వారా వైట్‌హౌజ్‌కి వచ్చిన తరువాత హెలీకాప్టర్ నుంచి దిగుతున్న సమయంలో తన తల డోర్‌కు తగిలింది. తరువాత జో బైడెన్ సౌత్‌లాన్ మీదుగా నడుస్తూ విలేకరుల సమావేశానికి వెళ్లారు. అక్కడ తాను ఇసుకబ్యాగ్ మూలంగా కిందపడ్డానని విలేకరులతో చమత్కరించారు. ప్రెసిడెన్సీలో అత్యధిక వయస్సున్న అధ్యక్షులు జో బైడెన్. బైడెన్‌కు ప్రస్తుతం 80 ఏళ్లు. ఈ వయస్సులో తిరిగి 2024 ఎన్నికలలో రెండవసారి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ సంవత్సరం అతని అధికారిక వైద్యుని నివేదిక ఆధారంగా అతను శారీరకంగా దృఢంగా ఉన్నారని.. అతను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో నవంబర్ 2020లో అపుడు అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల్లో గెలిచిన కొద్దిసేపటికే బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారీ పడటంతో కాలు విరిగింది.
*బాలీవుడ్ లో భారీ ఆఫర్ కొట్టేసిన రష్మిక..!!
తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ చిన్నది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కొట్టేసింది.ఇక పుష్ప2 విడుదల అయితే.. ఆమెకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలను అందుకుంటుంది రష్మిక. తెలుగులో రవితేజ హీరోగా.. రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కులు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాను హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది ఆ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. తెలుగులో విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ అయితే రాలేదు కాని.. హిందీలో మాత్రం భారీస్థాయిలో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటించనుండగా ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాలో రష్మిక మందన్నను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.ప్రభుదేవ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ దాదాపు గా మంచి విజయం సాధించాయి.ఈ సినిమా కూడా పక్కా పధకం తో ఆయన తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈసినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.
