కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీష్ సిసోడియా కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాంగ్మూలం ఆదివారం సీబీఐ తీసుకోనుంది. ఈనెల 11న తాను అందుబాటులో ఉంటానంటూ కవిత ప్రకటించిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు ఆమె ఇంటికి నేడు ఉదయం 11గంటలకు రానున్నారు సీబీఐ అధికారులు. అయితే.. ఇప్పటికే సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ నోటీసులను కల్వకుంట్ల కవిత అందుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సీబీఐకి వివరణ ఇవ్వనున్నారు కవిత. ఇవాళ సీబీఐ రాకతో కవిత నివాసం వద్దకు నేతలు, కార్యకర్తలు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేసింది టీఆర్‌ఎస్. కవితకు నోటీసు రాజకీయ కుట్ర అని అంటున్న టీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపణలు చేసింది. అయితే.. సీబీఐ విచారణలో ఏం జరుగుతుందని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ చట్టపరంగా వ్యవహరిస్తే సహకరించాలని.. అలాలేని పక్షంలో న్యాయపోరాటం చేయాలని కవిత భావిస్తున్నారు. సీబీఐ నోటీసులపై ఇప్పటికే న్యాయ నిపుణులతో కల్వకుంట్ల కవిత చర్చించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే.. మెటీరియల్ ఎవిడెన్స్ లేదని ఆ ఇద్దరికీ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఏపీలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఇంకా కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు ..వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.పెన్నా నదికి వరద ప్రవాహం పెరగడంతో. సోమశిల జలాశయం నుంచి నీటి విడుదలను పెంచుతున్నారు. గూడూరు. నాయుడుపేట డివిజన్ లలో వరద ప్రభావం అధికంగా ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..నెల్లూరు జిల్లాలో వరదల పరిస్థితి పై మా ప్రతినిధి అమర్ నాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు.
కోమటిరెడ్డికి షాక్..
పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ కమిటీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, కార్యవర్గ చైర్మన్‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్, 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది. 26 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షులను, 84 మంది జనరల్ సెక్రటరీలను అధిష్ఠానం నియమించింది. ఈ రెండు కమిటీల్లో పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు.
పాలమ్మే స్థాయి నుంచి పాలించే స్థాయికి..
సుఖ్వీందర్ సింగ్‌ది మొదట్లో సాధారణ జీవనమే. ఆయన తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు కూడా ఒకప్పుడు పాలు విక్రయించారు. పాలు విక్రయించిన సుఖ్వీందర్.. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. రాష్ట్రానికి ఏడో సీఎంగా పాలన అందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సింగ్ సుఖు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది. ఆయన గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సుఖ్వీందర్ సింగ్ సుఖు హమీర్‌పూర్ జిల్లా నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనుండగా.. డిప్యూటీ సీఎంగా ముకేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభా పక్ష నేతగా సుఖ్వీందర్ సుఖును ఎన్నుకొన్నారు.
వాయుగుండంగా మారిన మాండూస్
వాయుగుండంగా కొనసాగుతోంది మాండూస్ తుఫాన్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లా్ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ బలహీనపడినప్పటికి కోస్తాలో రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీవ్రత తగ్గడంతో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. మత్స్యకారులు, రైతులు మరో 36 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన మాండూస్.. రెండు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. మాండూస్ తుఫాను బలహీనపడటంతో, చెన్నైలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాజధాని నగరం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వచ్చే 48 గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, డిసెంబర్ 12 నుండి వర్షం క్రమంగా తగ్గుతుందని ఐఎండీ శనివారం సాయంత్రం తెలిపింది. ఈ తుఫాను ఉపసంహరణ కారణంగా చెన్నైతో పాటు ఈరోడ్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, తేని, దిండిగల్, తెన్‌కాసి జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో శనివారం అంతా కుండపోత వర్షం కురిసింది.
ఎయిరిండియా విమానంలో పాము కలకలం
శనివారం దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కలకలం రేపింది. కోల్‌కతా నుంచి బయలుదేరిన బీ-737-800 విమానం కేరళ మీదుగా దుబాయ్ చేరుకోగా.. కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ విచారణ జరుపుతోందని సీనియర్ అధికారి తెలిపారు. బీ737-800 విమానం కేరళలోని కాలికట్ నుంచి రాగా.. ప్రయాణికులను సురక్షితంగా దింపారు. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమాన సిబ్బంది కార్గో క్యాబిన్‌ను చెక్ చేస్తున్న సమయంలో అందులో పాము కనిపించింది. దీంతో వారు హడలిపోయారు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. దుబాయ్ విమానాశ్రయానికి చేరుకోగానే విమానం కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని, విమానాశ్రయ అగ్నిమాపక సేవలకు కూడా సమాచారం అందించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి తెలిపారు.
పీటీ ఉషకు అరుదైన గౌరవం
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో కొత్త శకానికి పునాది పడింది. పరుగుల రాణిగా పేరొందిన పీటీ ఉష(58) ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో ఆమె ఎన్నిక లాంఛనంగా జరిగింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సమక్షంలో శనివారం ఎన్నిక జరిగింది. వాస్తవానికి 2021 డిసెంబర్‌లోనే భారత ఒలింపిక్ సంఘం ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే ఐఓఏను సస్పెండ్ చేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ హెచ్చరించింది. నిషేధం ముప్పును ఎదుర్కొంటూ, కోర్టు జోక్యంతో ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి పీటీ ఉష మాత్రమే నామినేట్ అయ్యారు.
