Site icon NTV Telugu

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన అవార్డు

అత్యుత్తమ సేవలందించి ర్యాంక్ సాధించి, టెలికన్సల్టేషన్ సేవలలో తెలంగాణ పెద్ద రాష్ట్రాల విభాగంలో మూడవ స్థానంలో నిలిచింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2022లో భాగంగా శనివారం వారణాసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ అవార్డును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మొహంతి అవార్డును అందుకున్నారు. అక్టోబరు 12 నుంచి డిసెంబర్ 8 మధ్య జరిగిన టెలికన్సల్టేషన్ ప్రచారంలో తెలంగాణ 17,47,269 సంప్రదింపులు పూర్తి చేసి కేంద్రం నుంచి గుర్తింపు పొందింది. ర్యాంకింగ్స్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.

 

ఆ 87 మంది హోంగార్డుల తొలగించిన పోలీస్‌ శాఖ

అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే జరిగింది. నకిలీ డీవో(డిపార్ట్‌మెంటల్‌ ఆర్డర్‌)లతో ఉద్యోగంలో చేరిన హోంగార్డులపై వేటు పడింది. జిల్లాలో 87 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డుల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి పోలీసు శాఖలోని స్టేషన్లలో పనిచేయడం. వీళ్లకు ప్రభుత్వం నుంచే వేతనాలు అందుతాయి. రెండోది.. ఆన్‌–పేమెంట్‌.. అగ్నిమాపక, టీటీడీ, ఆర్టీసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ లాంటి సంస్థల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీళ్లకు ఆయా శాఖల నుంచి ప్రతీనెలా వేతనాలు అందుతాయి. ఈ సంస్థల్లో పనిలేనప్పుడు వీరిని పోలీసుశాఖకు అప్పగిస్తారు. ఆ సమయంలో వాళ్లకు వేతనాలు చెల్లించరు. పని ఉంటేనే వేతనాలు చెల్లిస్తారు. ఇటీవల ఇలాంటి హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేటపుడు చిత్తూరు ఆర్‌ఐ మురళీధర్‌ ఉండాల్సిన వాళ్లకంటే కొందరు ఎక్కువగా ఉండటంతో విషయాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

 

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. రైలును జెండా ఊపి ప్రారంభించిన అనంతరం రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ప్రధాని మోదీ చేతులు ఊపారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది. ఈరోజు తెల్లవారుజామున నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని అక్కడ ఆయనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు.

 

పిల్లలపై లైంగిక వేధింపులు.. సీజేఐ ఏమన్నారంటే?

చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యునిసెఫ్‌తో కలిసి జువెనైల్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహించిన పోక్సో చట్టంపై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్‌ ప్రసంగించారు. 18 ఏళ్ల లోపు వారు ఏకాభిప్రాయంతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినా పోక్సో చట్టం ప్రకారం నేరమేనని ఆయన వెల్లడించారు. పోక్సో చట్టం ప్రకారం సమ్మతి వయస్సుకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించాలన్నారు. పిల్లలపై లైంగిక అకృత్యాల అంశంలో సమాజంలో పెనుసమస్యగా తయారైందని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.

 

నలుగురు భార్యలు ముస్లింలకు చట్టబద్ధమే..

నలుగురు భార్యలు ఉండటం అసహజమన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్ ఒవైసీ మండిన డ్డారు. “మీది మాత్రమే సంస్కృతా..? మాది కాదా..? నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే. వారికి భరణం, ఆస్తుల్లో వాటా కూడా ఉంటాయి” అని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ కంటే పెద్ద హిందువు ఎవరన్న విషయంపై పోటీ నడుస్తోందని ఎద్దేవా చేశారు.

 

ఆహారంలో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు కొట్టించాడు..

భోజనంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు. భోజనం చేస్తుండగాఆహారంలో తల వెంట్రుకలు వచ్చాయని కోపోద్రిక్తుడైన భర్త, అత్తమామలు ఆ మహిళకు గుండు కొట్టించారు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్‌ చేశారు.

 

 

నటుడు శరత్ కుమార్‌కు అస్వస్థత

ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అస్వస్థతకు గురైన ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. దీని సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదైంది. శరత్‌ కుమార్‌ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. శరత్‌ కుమార్ త్వరగా కోలుకుని త్వరలోనే ఇంటికి రావాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

 

రచ్చరేపుతున్న పవన్‌కళ్యాణ్‌ పోస్టర్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మైత్రి మూవీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు మ‌రో కొత్త సినిమాను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్ టైమ్‌లో సుజీత్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో సినిమా ఉంటుంద‌ని ఓ వారం రోజులుగా న్యూస్ బ‌య‌ట చ‌క్కర్లు కొడుతుంది. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ప‌వ‌న్ చేస్తున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రక‌ట‌న వెలువ‌డింది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ మూవీ తెర‌కెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. దర్శకుడు హరీశ్ శంకర్-పవన్ కాంబినేషన్లో రానున్న సినిమాకు ‘ఉస్తాద్ భగత్సింగ్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే క్యాప్షన్ ఇచ్చి, పవన్ బైక్ పట్టుకున్న లుక్ను రిలీజ్ చేసింది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఆదివారం టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ బైక్ పై చేతిలో టీ గ్లాస్ తో నిల్చుని కనిపిస్తున్నాడు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ ఉంది. బైక్‌ పై చేయిపెట్టి స్టైల్ గా పవన్‌ నిలబడి ఓరేంజ్‌ లో చూస్తున్న లుక్‌ అదిరిపోయింది. పవన్‌ వెనుక ఉరుములులతో వున్న పవన్‌కు పవర్‌ లుక్ అదుర్స్‌ అంటున్నారు నెటిజన్స్‌.

Exit mobile version