Site icon NTV Telugu

Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌లో సరైన నాయకత్వం లేదు

Komatireddy Rajgopal Reddy Interview

Komatireddy Rajgopal Reddy Interview

తెలంగాణ కాంగ్రెస్‌లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు అందుకు గల కారణాలను వివరిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు.. అందుకోసం స్పీకర్‌ అపాయిట్‌మెంట్‌ కోసం చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో ఎన్టీవీ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇంటర్య్వూలో కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల కోసం ఇద్దరం ఒకేరకంగా ఆలోచిస్తామని వెల్లడించారు. నా ఆలోచన, మా అన్నయ్య ఆలోచన ఒకటేనని, వెంకట్‌ రెడ్డి పార్టీ మార్పుపై పరోక్షంగా హింట్‌ ఇచ్చారు రాజగోపాల్‌ రెడ్డి. మునుగోడు సమస్యలపై ఎన్నో సార్లు మాట్లాడాను. పత్రిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోదు. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజాశక్తి గొప్పదని హుజురాబాద్‌లో ప్రజలు నిరూపించారు. న

న్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నా. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి. నేను బాధతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నాకు కాంగ్రెస్‌ అంటే ఇష్టమే. మునుగోడు ప్రజలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. మా దగ్గర అవినీతి సొమ్ము లేదు. ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిని ముందు పెట్టాలని అధిష్టానాన్ని కోరాం. కాంగ్రెస్‌లో సరైన నాయకత్వం లేదు. నాయకత్వాన్ని లీడ్‌ చేసే వ్యక్తికి క్రెడబులిటీ, కెపాసిటీ ఉండాలి. కుంతియా గురించి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడా. 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా నాయకత్వాన్ని మార్చలేదు. పార్టీలో నాకు ఎలాంటి పదవి లేదు. అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

Exit mobile version