GST Reforms: కామన్ మ్యానికి భలే రిలీఫ్.. లగ్జరీలకు ఓ రేంజ్లో షాక్..!
- ఇప్పటి వరకు GSTలో 4 స్లాబులు..
- 12, 28 శాతం స్లాబుల తొలగింపు..
- ఇకపై కనిష్ఠంగా 5 శాతం, గరిష్ఠంగా 18 శాతం పన్ను..
- గృహావసర వస్తువులపై GST 5 శాతానికి కుదింపు..
- పాలు, పన్నీరు, రొట్టెలపై పన్ను మినహాయింపు..
- సాస్‌లు, పాస్తా, ఇనిస్టెంట్ నూడిల్స్‌పై ఇక 5 శాతం పన్ను..
- ఇకపై వ్యవసాయ యంత్రాలపై 5 శాతం GST..
- 12 రకాల సేంద్రీయ పురుగుల మందులపై 5 శాతం పన్ను..
- అత్యంత కీలకమైన ఎరువులపై 5 శాతం GST..
- 33 రకాల ఔషధాలపై పూర్తిగా పన్ను రద్దు..
- అత్యంత విలాస వస్తువులపై 40 శాతం పన్ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Reforms: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది. అంటే… ఇకపై కనిష్ఠంగా 5 శాతం, గరిష్ఠంగా 18 శాతం పన్ను పడుతుంది. సామాన్యులు, రైతులకు ఊరట కలిగించడమే లక్ష్యంగా GST స్లాబుల్లో మార్పులు చేశారు. సామాన్యులు వినియోగించే హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రెష్‌లు, టూత్ పేస్టులు, టేబుల్‌వేర్, కిచెన్వేర్, ఇతర గృహవసర వస్తువులపై GSTని 5 శాతానికి తగ్గించారు.
ఆల్ట్రా హైటెంపరేచర్ పాలు, పన్నీరు, అన్ని రకాల భారతీయ రొట్టెలపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తూ GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే, గతంలో 12, 18 శాతం పన్ను స్లాబులో ఉన్న నమ్కీన్, బుజియా, సాస్‌లు, పాస్తా, ఇనిస్టెంట్ నూడిల్స్ వంటి వాటిని 5 శాతం స్లాబ్‌లోకి తీసుకొచ్చింది. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, హార్టీకల్చర్ యంత్రాలు, కల్టివేటర్లు, హార్వెస్టర్లు, త్రెషర్లు, హేమూవర్లపై GST 12 నుంచి 5 శాతానికి తగ్గనుంది. 12 రకాల సేంద్రీయ పురుగుల మందులపై పన్నును 12 నుంచి 5 శాతానికి కుదించారు. వ్యవసాయ రంగానికి చాలా కీలకమైన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అమోనియాపై GST 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
Also Read
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్‌మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్‌కు మమత వార్నింగ్..
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది GST కౌన్సిల్. 33 రకాల ఔషధాలపై పూర్తిగా పన్ను మినహాయిస్తూ GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే, క్యాన్సర్‌తో పాటు అరుదైన జబ్బుల చికిత్సలో ఉపయోగించే మూడు ఔషధాలపై కూడా GSTని పూర్తిగా మినహాయించారు. సిమెంట్‌పై GST 28 నుంచి 18 శాతానికి తగ్గింది. సొంతిల్లు కట్టుకునే మధ్యతరగతికి ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు నిర్మలా సీతారామన్. చేతి వృత్తులు, కార్మికులు తయారు చేసే మార్బుల్ బ్లాక్‌లు, మధ్యంత చర్మ వస్తువులపై పన్ను 12 నుంచి 5 శాతానికి తగ్గింది. చేనేత రంగానికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సమస్యను పరిష్కరించారు. చేనేత వస్త్రాలపై GSTని 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.
ACలు, అన్ని రకాల TVలు, డిష్ వాషింగ్ మెషీన్లు. చిన్న కార్లు, 350 CC కంటే తక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు 18 శాతం స్లాబులోకి రానున్నాయి. పునరుత్పాధక ఇంధన రంగానికి చెందిన వస్తువులపైనా GST 12 నుంచి 5 శాతానికి తగ్గింది. బయోగ్యాస్ ప్లాంట్లు, విండ్‌మిల్స్, విండ్ ఆపరేటెడ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్లు, ఫొటోవాల్టెక్ సెల్స్, సోలార్ కుక్కర్లు, సోలార్ వాటర్ హీటర్లపై పన్ను తగ్గనుంది. GSTని రెండు స్లాబులకు కుదించినా… అత్యంత విలాస వస్తువులపై ఏకంగా 40 శాతం పన్ను విధించేలా నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, జర్దా, పొగాకు, బీడీలకు వర్తిస్తుందన్నారు. కూల్‌డ్రింక్స్‌కి కూడా 40 శాతం శ్లాబు కిందకు వస్తాయి. పెద్ద కార్లు, 350 CC కంటే ఎక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు, వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసే హెలికాప్టర్లు, విమానాలు, క్రీడా అవసరాలకు వినియోగించే అన్ని రకాల పడవలకు 40 శాతం శ్లాబ్ వర్తిస్తుంది.
సామాన్యుడిపై భారం తగ్గించే దిశగా GST కౌన్సిల్ సమష్టి నిర్ణయం తీసుకుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారన్నారు. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారామె.
తాజావార్తలు
-
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
-
Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..