నందమూరి హీరో గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. అక్టోబర్ 10 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు..
ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్న టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కు వెళ్లారు.. ఆ ఈవెంట్ కు ఎన్టీఆర్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఈ సోమవారం హైదరాబాద్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు..
ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ చాలా సింపుల్ గా, స్మార్ట్ లుక్ లో కనిపించాడు.. ఫార్మల్ లో స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.. అంతేకాదు ఎన్టీఆర్ గోల్డ్ కలర్ వాచ్ ను ధరించారు.. ఆ వాచ్ ధర ఎంత అని ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఆ వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు.. Audemars Piguet Royal Oak Offshore మోడల్ వాచ్ అని తెలుస్తుంది.. ధర విషయానికొస్తే కోటికి పైగానే ఉంది.. రూ.16,232,657 కనిపెట్టేసారు. ఈ విషయాన్ని ప్రస్తుతం నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు ఫ్యాన్స్.. ఎన్టీఆర్ అంటే అమాత్రం ఉండాలిగా,టైగర్ తో మాములుగా ఉండదని ఆ వాచ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..